Saturday 26 December 2009

2010లో ' కృత్రిమ జీవం' పుడుతుందా!?


విశ్వంలోకి దూసుకుపోతున్నాం.. భూగోళాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆరాటపడుతున్నాం.. చివరికి ప్రకృతిని కూడా మనకు నచ్చినట్లు మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అన్నీ కృత్రిమంగా మనమే తయారు చేసుకుంటున్నాం. చివరికి మానవ మెదడు, గుండె, రక్తం.. వీటిని కూడా ప్రయోగశాలలోనే పండించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఇన్నేళ్లు గడిచినా జీవశాస్త్రవేత్తలకు అర్థం కానిది, వారు కృత్రిమంగా తయారు చేయలేనిది ఒకటి మిగిలే ఉంది. అదే - ప్రాణం.. అంటే 'జీవం'. అయితే భవిష్యత్తులో 'జీవం' గుట్టు కూడా మనుషుల చేతులకు చిక్కబోతోంది. ఈ దిశగా ఇప్పటికే అనేక ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.

కృత్రిమ జీవం ఆవిర్భావం దిశగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుకు ముద్దుగా 'సింథటిక్‌ లైఫ్‌' అని పేరు పెట్టారు. ఎందుకంటే.. సింథియా అనేది ఈ భూమ్మీద బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక జీవ జాతి శాస్త్రీయనామం. మైకోప్లాస్మా జెనిటాలియం అనే సూక్ష్మజీవిలోని డిఎన్‌ఎ ఆధారంగా శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియాను సృష్టించడానికి సకల యత్నాలూ చేశారు.
జీనోమిక్స్‌లో అగ్రగణ్యుడిగా భావిస్తున్న జీవశాస్త్రవేత్త క్రెయిగ్‌ వెంటర్‌ ఓ అడుగు ముందుకేసి, 2008 జనవరిలో ఒక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో సింథటిక్‌ మైకోప్లాస్మా జెనిటాలియంను తన ప్రయోగశాలలో సృష్టించబోతున్నానన్నది ఆ ప్రకటన సారాంశం. నిజానికి అప్పట్లో క్రెయిగ్‌ ప్రకటనను ఎవరూ పెద్దగా విశ్వసించలేదు. కానీ కొన్ని నెలల క్రితం జీనోమ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రక్రియ ద్వారా వేర్వేరు మైకోప్లాస్మా జాతులకు చెందిన బ్యాక్టీరియా కణాలలో డిఎన్‌ఎను ప్రవేశపెట్టగలిగినట్లు క్రెయిగ్‌ బృందం ప్రకటించడమేకాక, ఆ ప్రక్రియను విజయవంతంగా ప్రదర్శించడంతో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది.
నిజానికి ఈ ప్రయోగంలో క్రెయిగ్‌ బృందం అనేక ఒడి దొడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. తన లోకి ప్రవేశించిన కొత్త డిఎన్‌ఎను నిర్వీర్యం చేసేందుకు బ్యాక్టీరియా కణం కొన్ని ఎంజైములను విడుదల చేయడం, ఆ పరిస్థితులను తట్టుకుని సింథియా డిఎన్‌ఎ మనుగడ సాధించడం.. మొత్తం ఈ ప్రక్రియనంతా క్రెయిగ్‌ బృందం చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి వచ్చింది.
నాణేనికి మరోవైపు..
మరోవైపు మరికొందరు జీవ శాస్త్రవేత్తలు కృత్రిమ జీవ కణానికి సంబంధించిన పదార్థాలను సృష్టించే పనిలో నిమగ్నులైపోయారు. హర్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త జార్జ్‌ చర్చ్‌ తన బృందం ఇప్పటికే ప్రొటీన్‌ను రూపొందించే స్వయం నిర్మాణ రైబోజోమ్‌ను సృష్టించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. అంతేకాదు, తన తదుపరి ప్రయోగం సజీవ రైబోజోమ్‌ను సృష్టించడమేనని, అది కూడా 2010లోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఏ నిమిషానికి ఏమి జరుగునో ..' అన్నట్లు ఒకవేళ జీనోమ్స్‌ అగ్రగణ్యుడు క్రెయిగ్‌ వెంటర్‌ తాను అనుకున్నది 2010లో సాధించగలిగితే.. నిజంగా ప్రయోగశాలలో 'జీవం' ఆవిర్భవిస్తే, మానవుడే.. మాధవుడు అనుకోవలసిందే కదా!

నోకియా నుంచి 'ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ 5530'


2012 కల్లా 40 శాతం వినియోగదారుల చేతుల్లో టచ్‌స్క్రీన్‌ మొబైల్‌ ఫోన్లు ఉంటాయని సెల్‌ఫోన్ల దిగ్గజం నోకియా జోస్యం చెబుతోంది. చెప్పటమే కాదు, టచ్‌స్క్రీన్‌ మొబైల్స్‌ మార్కెట్‌లో తన వాటాను పెంచుకునే దిశగా పావులు చకచకా కదుపుతోంది. యాపిల్‌ ఐఫోన్‌ హవాకు అడ్డుకట్ట వేయాలన్న తపనతో ఇంతకుముందే 5230 పేరిట టచ్‌ స్క్రీన్‌ ఫోన్‌ను విడుదల చేసిన నోకియా ఇప్పుడు మళ్లీ 5530 ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ పేరిట తాజాగా మరో టచ్‌స్క్రీన్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది నోకియా గతంలో ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ పేరిట విడుదల చేసిన 5800 టచ్‌స్క్రీన్‌ ఫోన్‌ను పోలి ఉన్నప్పటికీ దీని ప్రత్యేకతలు దీనివే.
ఆపరేటింగ్‌ సిస్టం : సింబయాన్‌ వెర్షన్‌ 9.4
డిస్‌ప్లే : 2.9 అంగుళాల టిఎఫ్‌టి రెసిస్టివ్‌ టచ్‌స్క్రీన్‌ (16 మిలియన్‌ కలర్స్‌)
కెమెరా : 3.15 మెగా పిక్సెల్‌ ఆటోఫోకస్‌ విత్‌ ఎల్‌ఇడి ఫ్లాష్‌
ఇతర ఫీచర్లు : ఆటో టర్న్‌-ఆఫ్‌, ఆటో రొటేట్‌, హ్యాండ్‌ రైటింగ్‌ రికగ్నిషన్‌, స్టీరియో స్పీకర్స్‌ విత్‌ 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యుఎస్‌బి, బ్లూటూత్‌, జిపిఆర్‌ఎస్‌, ఎడ్జ్‌, వైఫై, స్టీరియో ఎఫ్‌ఎం రేడియో విత్‌ ఆర్‌డిఎస్‌, ఆడియో, వీడియో ప్లేబ్యాక్‌, ఫోటో ఎడిటర్‌, డాక్యుమెంట్‌ వ్యూయర్‌, ఫ్లాష్‌ లైట్‌ 3.0 తదితర ఫీచర్లు ఉన్నాయి.
ధర : రూ.14,029

Friday 25 December 2009

నోషన్‌ ఇంక్‌ నుంచి 'స్మార్ట్‌ ప్యాడ్‌'


ఎప్పుడో ప్రాచీన కాలంలో వచ్చిన డెస్క్‌టాప్‌లు, ఆ 'మధ్య'యుగంలో వచ్చిన ల్యాప్‌టాప్‌లు.. నిన్న మొన్న వచ్చిన నెట్‌బుక్‌లపైన మోజు తగ్గిపోయిందా? 'లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఏదైనా వస్తే బాగుండు..' అనుకుంటున్నారా? అయితే మీలాంటి
వారికోసమే 'నోషన్‌ ఇంక్‌' కంపెనీ తాజాగా ఓ 'స్మార్ట్‌ ప్యాడ్‌'ను సిద్ధం చేసింది. 2010లో జరిగే కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షోలో ఆరంగేట్రం చేయనున్న ఈ లేటెస్ట్‌ డివైజ్‌కు ఇంకా పేరే పెట్టలేదు. మరి దీని ప్రత్యేకతలేమిటో ఓ లుక్కేద్దామా...

చూడడానికి ల్యాప్‌టాప్‌లా ఉన్నా 'షేపు' కొంచెం అదో టైపులో ఉంది కదూ! అప్పుడే ఏముంది? ఈ స్మార్ట్‌ ప్యాడ్‌ ప్రత్యేకతలు వింటే మీరే హాశ్చర్యపోతారు. Nvidia Tegra T20 చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ప్యాడ్‌ను పగలు ఒకలా, రాత్రిపూట మరోలా కనిపించే డిస్‌ప్లే స్క్రీన్‌ Pixel Qi Transflective Displayతో రూపొందించారు. దీనికున్న 10.1 అంగుళాలు డిస్‌ప్లే స్క్రీన్‌ 1080 పిక్సెల్స్‌ హై డెఫినిషన్‌ వీడియోను సపోర్ట్‌ చేయడమేకాక గది వెలుతురులో సాధారణ ఎల్‌సిడి మాదిరిగానే పనిచేస్తుంది. అదే పగటిపూట సూర్యకాంతి మీదపడినప్పుడు ఈ స్క్రీన్‌ ఆటోమేటిక్‌గా తన రంగులు కొంత తగ్గించుకుని ఇ-ఇంక్‌ ప్యానల్‌ మాదిరిగా మారిపోతుంది. అంటే.. పగటిపూట ఎండలోనూ టెక్స్‌ట్‌ మ్యాటర్‌, ఇమేజెస్‌, వీడియోలను స్పష్టంగా చూడగలిగే విధంగా మారుతుందన్నమాట. వేలిముద్రలు, గీతలు పడకుండా ఉండేందుకు ఈ డిస్‌ప్లే తయారీలో యాంటీ గ్లేరింగ్‌, ఫింగర్‌ప్రింట్‌ స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ప్యాడ్‌కు USB Portతోపాటుగా లేటెస్ట్‌గా వస్తున్న ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ను అనుసంధానం చేసుకునేందుకు వీలుగా HDMI Ports, 3.5 ఎంఎం స్టీరియో హెడ్‌ఫోన్‌ జాక్‌ అండ్‌ మైక్రోఫోన్‌ ఇన్‌పుట్‌, 3 మెగా పిక్సెల్‌ కెమెరా విత్‌ ఆటోఫోకస్‌, యాక్సిలరోమీటర్‌, ప్రాక్సిమిటీ, వాటర్‌ అండ్‌ యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. 16 జిబి, 32 జిబి స్టోరేజి సామర్థ్యంతో వెలువడే నోషన్‌ ఇంక్‌ స్మార్ట్‌ప్యాడ్‌లో కంపాస్‌, జిపిఎస్‌, వైఫై, బ్లూటూత్‌ అండ్‌ సెల్యులార్‌ (హైస్పీడ్‌ డేటా పాకెట్‌ యాక్సెస్‌) అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఇక దీని బ్యాటరీ బ్యాకప్‌ విషయానికొస్తే.. ఒక్కసారి పూర్తిస్థాయిలో రీఛార్జ్‌ చేసుకుంటే 8 గంటలపాటు హైడెఫినిషన్‌ వీడియో చూడవచ్చు లేదంటే 16 గంటలపాటు వైఫై బ్రౌజింగ్‌ చేయవచ్చు. స్టాండ్‌బై టైం వచ్చేసి 48 గంటలు, అంటే.. రెండ్రోజులు ఉంటుంది.
ఇన్ని సదుపాయాలున్న ఈ 'అనామిక' ధర ఎంత ఉంటుందో తెలియాలంటే ఒకటి, రెండు నెలలు నిరీక్షించాల్సిందే మరి!

Tuesday 1 December 2009

తక్కువ ధర లో 'డ్యూయల్‌ సిమ్‌' మొబైల్‌!


ఈ ఫోన్‌ పేరు AF11. ఎయిర్‌ఫోన్‌ మొబైల్స్‌ అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో ఎఫ్‌ఎం రేడియోతోపాటు ఎంపి3 పాటలు వినగలిగే సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్‌ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 7 గంటలపాటు మాట్లాడుకోవచ్చు. అలాగే స్టాండ్‌బై టైం 4 గంటలు ఉంటుంది. బ్లాక్‌ అండ్‌ గ్రే, బ్లాక్‌ అండ్‌ రెడ్‌, బ్లాక్‌ అండ్‌ బ్లూ కలర్స్‌ కాంబినేషన్‌లో ఈ ఫోన్‌ లభిస్తుంది. ఇన్ని సదుపాయాలు ఉన్న ఈ ఫోన్‌ ఖరీదు ఎంతో తెలుసా? కేవలం రూ.1,499 మాత్రమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్‌. అంటే.. ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు వేసుకోవచ్చన్నమాట. ఇంత తక్కువ ధరకే ఇన్ని ఫీచర్స్‌ ఉన్న డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌ అంటే మన వాళ్లు ఊరుకుంటారేంటీ.. ఎగబడిపోరూ!?

ఈ ఐఫోన్‌ ఖరీదు రూ.14.7 కోట్లు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ తయారైంది. దీనిని 'ఐఫోన్‌ త్రీజి సుప్రీమ్‌' అని పిలుస్తున్నారు. ఈ ఫోన్‌ ఖరీదు రూ.14.7 కోట్లు. దీనిని బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన గోల్డ్‌ స్టిక్కర్‌ ఇంటర్నేషనల్‌ అనే కంపెనీ తయారు చేసింది. స్టువార్ట్‌ హ్యూ అనే డిజైనర్‌ ఈ ఐఫోన్‌కు రూపకల్పన చేశారు. 22 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ ఐఫోన్‌లో 200 వజ్రాలు తాపడం చేశారు. ఈ ఫోన్‌ ఫ్రంట్‌ ప్యానల్‌పై 136 వజ్రాలు ఉండగా, అందులో 53 వజ్రాల వరకు ఒక్క ఐఫోన్‌ లోగోలోనే పొందుపరిచారు. ముందు భాగంలో ఉన్న నావిగేషన్‌ బటన్‌కు 7.1 క్యారెట్ల విలువైన వజ్రాన్ని తాపడం చేశారు. మొత్తంమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గోల్డెన్‌ ఐఫోన్‌ తయారీకి దాదాపు పది నెలలు పట్టింది. ‌


Wednesday 25 November 2009

'మంచు'కొస్తున్న ముప్పు!

2035 నాటికల్లా హిమాలయాలు కనుమరుగు!?

హిమాలయ పర్వతాలు.. పేరు వింటే చాలు చల్లని గాలి తెమ్మర తాకినట్లు ఒళ్లు పులకరిస్తుంది. మన దేశానికి ఉత్తరాన శత్రు దుర్భేద్యంగానే కాదు, దేశంలో ప్రవహించే హిందూ, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులు జీవ నదులుగా ప్రసిద్ధికెక్కడానికి కూడా మంచు పర్వతాలే కారణం. అలాంటి మహోన్నతైన హిమాలయాలకు ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్లుగా.. భూతాపం కారణంగా హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగి నీరైపోతున్నాయి. కరగడంలో కూడా అలా ఇలా కాదు.. ప్రపంచంలో ప్రాంతంలోనూ మంచు కరగనంత వేగంగా మన హిమాలయాలు కరిగిపోతున్నాయట. ఇది ఇలాగే సాగితే, మరో పాతికేళ్ల తరువాత హిమాలయాలు అసలు కనిపించకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం) విపరీతంగా పెరిగిపోవడం వల్ల హిమాలయ శ్రేణుల్లోని మంచు త్వరితగతిన కరిగిపోతుండడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తుతుందని ఏళ ్లతరబడి పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక చర్చాపత్రం తీవ్ర వివాదాస్పదమైంది. అసలు భూతాపానికి, హిమాలయాలు కరగడానికి మధ్య సంబంధాన్ని ధ్రువీకరించే ఎలాంటి ఆధారమూ ఇంతవరకు లభించలేదని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ ఆ పత్రంలో పేర్కొనడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వాదనతో ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) తీవ్రంగా విభేదిస్తోంది. నోబెల్‌ బహుమతి పొందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో ఏర్పాటైన ఈ సంస్థ వాతావరణంలో కలుగుతున్న మార్పులపై అధ్యయనం జరిపి రెండేళ్ల క్రితమే తన నాలుగో సమగ్ర నివేదికను విడుదల చేసింది.
ఐపిసిసి నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ కరగనంత వేగంగా మన హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగిపోతున్నాయి. హిమాలయాలలో మంచు పొరలు కరిగి నీరైపోవడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయనడానికి, భూతాపం రోజురోజుకి పెరుగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఐపిసిసి ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ భూతాపం, హిమాలయాలలో మంచు కరగటం ఇలాగే కొనసాగితే, 2035 నాటికి హిమాలయాలు పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని కూడా ఈ సంస్థ హెచ్చరిస్తోంది.
భారీ ముప్పు..
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావం ఒక్క మనదేశంపైనే కాదు.. యావత్‌ ఆసియం ఖండంపై ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో వంద కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి బారిన పడనున్నట్లు కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన చర్చాపత్రాన్ని తయారు చేసింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. జియొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి. ఆయన పేరు వి.కె.రైనా. " హిమాలయ పర్వతాలపై ఉన్న మంచు పొరలు కరగ డం అనేది చాలా దశాబ్దాల క్రితమే మొదలైంది. అయితే ఈ విషయాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు పంతొమ్మిదో శతాబ్దం మధ్య భాగంలోనే గుర్తించగలిగారు. కానీ గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న అధ్యయనంలో హిమాలయ పర్వత సానువులకంటే కూడా అలస్కా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతాలలో మంచు పొరలు శరవేగంగా కరిగిపోతున్నట్లు తెలుస్తోంది..'' అని రైనా ఆ చర్చాపత్రంలో పేర్కొన్నారు. అంతేకాదు, "మంచు పొరలు కిందికి జారటం, ఆ సమయంలో వచ్చే ఒకరకమైన శబ్దం.. వీటిని బట్టి మంచు పొరలు కరిగిపోతున్నాయని, ఇందుకు కారణం భూతాపమేనని శాస్త్రీయంగా చెప్పలేం. ఎందుకంటే ఈ మంచు పొరలు జారటం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతోంది.
అంతెందుకు.. గంగోత్రి పర్వత సానువులనే తీసుకుంటే .. అక్కడ గత రెండు సంవత్సరాలుగా మంచు కరిగిన దాఖలాలు లేవు..'' అని వి.కె.రైనా పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది.
నిపుణులు ఏమంటున్నారు?
వి.కె.రైనా వాదనను, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన చర్చాపత్రంలో పేర్కొన్న విషయాలలో కొన్నింటిని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ చైర్మన్‌ రాజేంద్ర పచౌరి మాత్రం కొట్టిపారేశారు. " బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి నివేదికలు ఎలా తయారు చేస్తారో నాకు అర్థం కావ డం లేదు..'' అని ఆయన 'ది గార్డియన్‌' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాదు " అసలు ఆ చర్చాపత్రం అశాస్త్రీయమైనది, ఏకపక్షంగా రూపుదిద్దుకున్నది..'' అంటూ ఢిల్లీలోని ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌(టిఇఆర్‌ఐ)కు చెందిన లీడింగ్‌ గ్లేసియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఇక్బాల్‌ హస్నయిన్‌ అభిప్రాయపడుతున్నారు. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల శాతం పెరుగుతోందని 1980 తరువాత ప్రచురితమైన పలు శాస్త్రీయ కథనాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ చర్చా పత్రాన్ని రూపొందించిందని, హిమాలయ పర్వతసానువుల్లో మంచు పొరలు కరగటానికి ప్రధాన కారణం భూతాపమేనని ఈ శాస్త్రీయ కథనాలలో తగిన ఆధారాలు కూడా ఉన్నాయని హస్నయిన్‌ తన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. నిజానికి పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ 'హిమాలయాలు-కరుగుతున్న మంచు' అనే అంశంపై తాను రూపొందించిన చర్చాపత్రాన్ని విడుదలకు నెలరోజుల ముందే సమీక్ష కోసం
గ్లేసియాలజిస్ట్‌ సయ్యద్‌ ఇక్బాల్‌ హస్నయిన్‌ వద్దకు పంపించింది. దానిని ఆమూలాగ్రం చదివిన ఆయన తన కామెంట్స్‌ను, వాటికి సంబంధించిన ఆధారాలను సైతం ఆ శాఖకు అందజేశారు. అయినప్పటికీ వాటిని ఆ మంత్రిత్వ శాఖ విస్మరించడమే కాకుండా ఎలాంటి మార్పులు చేయకుండానే చర్చాపత్రాన్ని విడుదల చేసింది.
మంచు నీటి మళ్లింపు..
నిజానికి హిమాలయాలలో మంచు పొరలు కరగడానికి వాతావరణంలోకి విడుదల అవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులలోని ఒక్క కార్బన్‌డయాక్సైడ్‌ మాత్రమే కారణం కాదని, బ్లాక్‌ కార్బన్‌, మీథేన్‌లతోపాటు వాతావరణంలోని ఓజోన్‌ కూడా ఇందుకు కారణమవుతున్నాయనే ది ప్రముఖ గ్లేసియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఇక్బాల్‌ హస్నయిన్‌ అభిప్రాయం. ఒక్క హస్నయిన్‌ మాత్రమే కాదు, హిమాలయ పర్వత సానువులలో తూర్పు దిక్కున మంచు పొరలు కరిగి, ఆ నీరంతా పారుతూ వచ్చి నేపాల్‌, సిక్కిం, భూటాన్‌ సరిహద్దుల్లో పెద్ద పెద్ద సరస్సులుగా మారుతోందని టిఇఆర్‌ఐకే చెందిన మరో గ్లేసియాలజిస్ట్‌ శ్రేష్ఠ్‌ తయాల్‌ కూడా అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయాలు నిజమనడానికి ప్రతిష్ఠాత్మక సైన్స్‌ పత్రిక 'నేచర్‌' ఇటీవల ప్రచురించిన కథనాలే తాజా ఉదాహరణ. నేచర్‌ కథనాల ప్రకారం.. హిమాలయాలలోని మంచు నిరంతరం కరుగుతూ, ఆ నీరంతా తమ దేశంవైపు ప్రవహిస్తుండడంతో, తమ దేశంలో వరదలు సంభవించకుండా ఆ నీటిని దారి మళ్లిస్తూ భూటాన్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు - 2001లో ఉత్తరాఖండ్‌లోని హెచ్‌ఎన్‌బి ఘర్‌వాల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది జియాలజిస్ట్‌లు రూపొందించిన ఓ శాస్త్రీయ పత్రాన్ని 'కరెంట్‌ సైన్స్‌' పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక కథనం ప్రకారం.. గత రెండు వందల సంవత్సరాలలో హిమాలయాలలోని గంగోత్రి పర్వత శిఖరం ఎత్తు రెండు కిలోమీటర్ల మేర తగ్గింది. ఇందులో నలభై శాతం తరుగుదల కేవలం గత 25 సంవత్సరాలలోనే సంభవించింది. అంటే.. గత రెండు వందల సంవత్సరాల కంటే ఇటీవలి పాతిక సంవత్సరాలలోనే ఈ శిఖరం ఎక్కువగా కరిగిపోయిందన్నమాట. ఇందుకు కారణం.. ఇంకేముంటుంది 'భూతాపం' తప్ప.
అసలు నిజం.. ఉపగ్రహానికెరుక!
ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఛీనాబ్‌, పార్వతి, బసవ బేసిన్స్‌లో ఉన్న 466 మంచు కొండలను అధ్యయనం చేసి ఆసక్తి కరమైన విషయాలను కనుగొంది. 1962 నాటితో పోల్చి చూసుకుంటే ప్రస్తుతం ఈ మంచు కొండలన్నీ 21 శాతం తరిగిపోయాయని ఈ బృందం తేల్చింది. ఇదే విషయాన్ని 2007లో తయారు చేసిన ఓ పత్రంలో కూడా అనిల్‌ కులకర్ణి తదితర శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, ఇటీవల స్పేస్‌ ఏజెన్సీకి చెందిన శాస్త్రావేత్తల బృందం హిమాలయాలలో కరుగుతున్న మంచు కారణంగా ఎంత నీరు సట్లెజ్‌ నదిలో చేరుతుందనే విషయంపై కూడా అధ్యయనం జరిపింది. 2040 నాటికి హిమాలయాలలో ఉష్ణోగ్రత ఇప్పుడున్నదానికంటే మరొక్క డిగ్రీ సెల్సియస్‌ పెరుగుతుందని, దాని వల్ల సట్లెజ్‌ నదిలో చేరే నీరు ఇప్పుడున్నదానికంటే 8 నుంచి 28 శాతం అధికంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల అంచనా!





Wednesday 18 November 2009

అంతరిక్షంలోకి.. అనుకోని అతిథులు!

తేదీ : 16 నవంబరు 2009
సమయం : మధ్యాహ్నం 2:28 గంటలు
ప్రదేశం : ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌, లాంచ్‌ప్యాడ్‌ 39-ఎ.
విషయం : ఆరుగురు వ్యోమగాములు, అంతరిక్ష కేంద్రానికి చేరవేయాల్సిన వివిధ పరికరాలతో వ్యోమనౌక అట్లాంటిస్‌ సిద్ధంగా ఉంది. అఖరుసారి అన్ని తనిఖీలు విజయవంతంగా నిర్వహించిన తరువాత గ్రౌండ్‌ కంట్రోల్‌ నుంచి మిషన్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైంది.
5... 4... 3... 2... 1... 0... బ్లాస్ట్‌!
నిప్పులు చిమ్ముకుంటూ అట్లాంటిస్‌ నింగికి ఎగసింది.

'ఏంటీ.. ఇదంతా ప్రతిసారీ జరిగేదే కదా..' అనుకుంటున్నారు కదూ! ఆగండి.. తొందరపడకండి. ఈ అట్లాంటిస్‌ వ్యోమనౌకలో వ్యోమ గాములతో పాటు వానపాము జాతికి చెందిన కొన్ని వేల లార్వాలను కూడా అంతరిక్షంలోకి పంపించారు. ఇదీ అసలు విశేషం!
ఏం చేస్తారు...?
అంతరిక్షంలోకి వెళ్లి రావడం మనం అనుకునేంత సులువేం కాదు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా ఎంతో కఠోర శిక్షణ పొందినా.. వెళ్లేటప్పుడున్నంత ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు వ్యోమగాముల్లో కనిపించదు. కారణం.. అంతరిక్షంలో గడిపేది కొద్దిరోజులే అయినా.. అప్పటికే వారి కండరాలు బాగా క్షీణిస్తాయి. అందువల్లే అంతరిక్ష కేంద్రంలో కొన్ని రోజులపాటు విధులు నిర్వర్తించిన వ్యోమగాములను భూమిమీదికి చేర్చడం.. వారి స్థానంలో ఇతర వ్యోమగాములను పంపించడం. అయితే రోదసిలో మానవ కండరాల క్షీణత ఎలా జరుగుతుందనేది నేటికీ అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు పూనుకున్నారు. సోమవారం అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన వ్యోమనౌక అట్లాంటిస్‌లో వ్యోమగాములతోపాటు కొన్ని వేల వానపాము లార్వాలను కూడా పంపించారు. ఇవి ఎంత చిన్నవి అంటే.. మైక్రోస్కోప్‌ కింద చూస్తే తప్ప కనిపించని పరిమాణంలో ఉంటాయి. అసలు అంతరిక్షంలో ఏం జరుగుతుంది? ఈ కండరాల క్షీణత కేవలం మానవుల్లోనేనా? లేక ప్రాణమున్న ప్రతి జీవిలోనూ జరుగుతుందా? దేని ప్రభావం వల్ల ఇలా జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వానపాము లార్వాలే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి భూమ్మీదికి తిరిగొచ్చాక వీటి శరీరంలో వచ్చిన మార్పులపై నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అవసరమైన పరిశోధనలు నిర్వహిస్తారు. దీంతో అసలు జీవుల్లో కండరాలు నిర్మింపబడడానికి, క్షీణించడానికి కారణాలేమిటో తెలిసిపోతాయన్నది జీవ శాస్త్రవేత్తల అంచనా.
రోదసిలో ఎక్కడ...?
వ్యోమనౌక అట్లాంటిస్‌ బుధవారం నాటికి అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. ఆ తరువాత ప్రత్యేకమైన సెల్‌ కల్చర్‌ బ్యాగ్స్‌లో.. సుషుప్తావస్థలో.. ఉన్న ఈ వానపాము లార్వాలను అంతరిక్ష కేంద్రంలోని జపాన్‌కు చెందిన జీవ ప్రయోగశాల 'కిబో'కు చేరుస్తారు. అక్కడ వీటిని మళ్లీ జాగృతావస్థలోకి తీసుకొచ్చి.. వ్యోమగాముల మాదిరిగానే వీటిని కూడా భార రహిత స్థితికి గురిచేస్తారు. నాలుగు రోజులపాటు వీటిని అంతరిక్ష వాతావరణంలో ఉంచి తిరిగి సుషుప్తావస్థకు చేరుస్తారు. తిరిగి భూమ్మీదికి తీసుకొచ్చాక నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలకు చేర్చి, అంతరిక్షంలో గడిపిన సమయంలో వాటి శరీరాలలో వచ్చిన మార్పులపై అధ్యయనం చేస్తారు.
ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న కిబో ప్రయోగశాలలో బయోమెడిసిన్‌, మెటీరియల్‌ సైన్స్‌ తదితర విషయాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఇక్కడికి చేరే వానపాము లార్వాలపై నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లినికల్‌ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్‌ నాథానియేల్‌ పరిశోధనలు జరుపుతారు. ముఖ్యంగా వానపాము లార్వాల శరీరాలలోని కండరాలలో ప్రొటీన్‌ విచ్ఛిన్నానికి కారణమయ్యే సంకేతాలేమిటో ఈయన అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధనలు గనుక ఫలిస్తే.. కండరాల క్షీణతకు గురయ్యే రోగుల శరీరాలలో దీర్ఘకాలం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయంపై శాస్త్రవేత్తలకు మరింత అవగాహన కలుగుతుంది. అలాగే వృద్ధాప్యం మీద పడి కదలలేని స్థితిలో మంచంపైనే ఉండేవారు, మధుమేహ రోగగ్రస్థుల శరీరాలలో కండరాలు క్షీణించడానికి కారణాలేమిటో కూడా తెలుస్తుంది.
అవే ఎందుకని...?
అంతరిక్షంలో మానవ కండరాల క్షీణతపై జరిపే పరిశోధనలలో వానపాము లార్వాలనే ఎంచుకోవడానికి ఒక కారణముంది. ఈ వానపాము లార్వాలు సి-ఎలిగాన్స్‌ అనే రకానికి చెందినవి. ఇవి ఈ భూమిపై ఆవిర్భవించిన మొట్టమొదటి బహుకణ జీవులు. వీటి శరీరంలో ఉండే కండరాలు అచ్చు మానవ శరీరంలో ఉండే కండరాల మాదిరిగానే ఉంటాయి. వీటి జన్యువులలో అధికభాగం మానవ డిఎన్‌ఎలోని జన్యువులు నిర్వర్తించే విధులనే నిర్వర్తిస్తుంటాయి. మానవ శరీర నిర్మాణానికి వీటి శరీర నిర్మాణానికి చాలా దగ్గరి పోలికలు ఉండడంతో జీవ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు వీటినే ఎంచుకున్నారు. ఈ వానపాము లార్వాలను బ్రిస్టల్‌లోని ఓ చెత్త కుప్ప నుంచి సేకరించారు. సి-ఎలిగాన్స్‌ ఆర్‌ఎన్‌ఎఐ ఇన్‌ స్పేస్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (సిఇఆర్‌ఐఎస్‌ఇ) గా పిలుస్తున్న ఈ పరిశోధనలన్నీ జపాన్‌లోని సెండాయ్‌లో ఉన్న టొహొకు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ అత్సుషి హిగాషితాని ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈయనే ఈ ప్రాజెక్టుకు ముఖ్య పరిశోధకుడు. " ఈ భూమ్మీద మనకు తెలియని కొన్ని విషయాలు అంతరిక్షంలో తెలుస్తాయి. అంతరిక్షంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా మన శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుందో వానపాము లార్వాలపై జరిపే ఈ పరిశోధనల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం..'' అని ప్రొఫెసర్‌ అత్సుషి హిగాషితాని వ్యాఖ్యానిస్తున్నారు.


Saturday 14 November 2009

రాక్షసి బల్లుల కనుమరుగుకు కారణమిదేనా?

హిందూ మహాసముద్ర జలాల్లో భూమిని ఢీకొట్టిన భారీ గ్ర హ శకలం
500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి
శివ క్రే టర్‌పై శాసవేత్తల దృష్టి

ఓ భారీ గ్రహశకలం గతితప్పి భూమికేసి దూసుకొచ్చింది. సుమారు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఆ గ్రహ శకలం ముంబైకి సమీపంలో హిందూ మహా సముద్ర జలాల్లో భూ ఉపరితలాన్ని ఢీకొట్టింది. భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో పరిసరప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ ఒక్క సారిగా పేలిపోతే ఎంత శక్తి విడుదలవుతుందో.. పేలుడు సందర్భంగా అంత శక్తి విడుదలైంది. గ్రహశకలం భూమిని గుద్దుకోవడం కారణంగా దాదాపు 500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో భారీ గొయ్యి(క్రేటర్‌) ఏర్పడింది. ఈ సంఘటన వల్ల అప్పటికి భూమిపై నివసిస్తున్న సమస్త జీవరాశులు తుడిచిపెట్టుకు పోయాయి. ఇదేం సైన్స్‌ఫిక్షన్‌ సినిమా కాదు.. 6.5 కోట్ల సంవత్సరాల కిత్రం వరకు ఈ భూమిపై తిరుగాడిన రాక్షసబల్లులు ఎలా అంతరించిపోయాయన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానమిది.

మానవులకు పూర్వం.. 14 కోట్ల సంవత్సరాలపాటు ఈ భూమిపై ఏకచ్ఛత్రాధిపత్యంగా జీవనం సాగించిన డైనోసార్లు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కసారిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇందుకు కారణం భారీ గ్రహశకలం ఢీకొట్టడమేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీకి చెందిన శంకర్‌ ఛటర్జీ అనే ప్రొఫెసర్‌ ఈ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. ఈయన ముంబైకి పశ్చిమ తీర ప్రాంతంలో ఆనాడు గ్రహశకలం ఢీకొనడం వల్ల ఏర్పడిన భారీ గొయ్యిని కూడా గుర్తించారు. దానికి శివ క్రేటర్‌ అని పేరు పెట్టారు. అయితే.. ఛటర్జీ ప్రతిపాదనలు డైనోసార్ల విలుప్తంపై వెల్లువెత్తిన అన్ని ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు.. ప్రపంచ వ్యాప్తంగా భూమి మీద తిరుగాడే అన్ని డైనోసార్లు ఏకకాలంలో చనిపోయాయి. అదే సమయంలో.. మిగతా చిన్న జీవులు, ఎగిరే రాక్షస బల్లులు మాత్రం ఈ ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడగలిగాయి. ఇదెలా సాధ్యమైందన్న ప్రశ్నకు ఇంత వరకు సరైన సమాధానం దొరకలేదని అమెరికా పేలియోనాలజిస్ట్‌ గ్రెగరీ పాల్‌ వ్యాఖ్యానించారు.
ఎలా అంతరించిపోయాయి?
రాక్షసబల్లులు ఎలా అంతరించిపోయాయనే విషయమై ప్రస్తుతం రెండు సిద్ధాంతాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, మరొకటి.. అగ్నిపర్వతాల పేలుడు. భారీ గ్రహశకలం లేదా తోకచుక్క భూమిని బలంగా ఢీకొట్టడం వల్ల రాక్షసబల్లులన్నీ అంతరించి పోయాయని విశ్వసించే శాస్త్రవేత్తలు చాలా మందే ఉన్నారు. శంకర్‌ ఛటర్జీ కంటే ముందు కొందరు శాస్త్రవేత్తలు చిక్సులుబ్‌ క్రేటర్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ భారీ గొయ్యి మెక్సికోలోని యుకాటన్‌ ద్వీపకల్పంలో ఉంది. చిక్సులుబ్‌ విస్తీర్ణాన్ని పరిశీలిస్తే.. ఆ గ్రహశకలానికి భూమి మీదున్న జీవులన్నింటినీ తుడిచిపెట్టేయగలిగిన శక్తి లేదని శాస్త్రవేత్తలు తేల్చిపారేశారు. దీంతో అగ్ని పర్వతాల పేలుళ్లే డైనోసార్ల విలుప్తానికి కారణమన్న వాదనకు ఊతం లభించింది. అయితే.. శంకర్‌ ఛటర్జీ శివ క్రేటర్‌ను గుర్తించడంతో.. మళ్లీ గ్రహశకల సిద్ధాంతానికి ప్రాచుర్యం లభించింది. దాదాపు 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శివ క్రేటర్‌ ఇప్పటి వరకు భూమిని గ్రహశకలాలు ఢీకొనడం వల్ల ఏర్పడిన క్రేటర్‌లలో కెల్లా అతి పెద్దది. రాక్షసబల్లుల విలుప్తానికి, శివ క్రేటర్‌కు సంబంధం ఉందని ఛటర్జీ వాదిస్తున్నారు.
భారత్‌
తో దగ్గర సంబంధం?
రాక్షసబల్లుల విలుప్తానికి, భారత్‌కు దగ్గర సంబంధం ఉందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. మధ్య భారత దేశంలోని దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో భారీ అగ్నిపర్వత పేలుళ్ల వల్ల రాక్షసబల్లులు అంతరించాయనేది వారి వాదన. ఇందుకు జబల్‌పూర్‌ ప్రాంతంలో లభించిన భారీ టైటానోసారిడ్‌ డైనోసార్‌ శిలాజాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు.జబల్‌పూర్‌ సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన తవ్వకాల్లో లావా ప్రవాహం మధ్యలో చిక్కుబడిపోయిన టైటానోసారిడ్‌కు చెందిన ఓ తుంటి భాగం శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సాక్ష్యాల ఆధారంగా గ్రహశకలం ఢీకొట్టడంతోపాటు, అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా రాక్షసబల్లుల విలుప్తానికి కారణమేనని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వాదనలు ఎలా ఉన్నా.. ఇప్పటికీ కొన్ని మౌలిక ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకలేదు. రాక్షసబల్లులు శారీరకంగా చాలా అభివృద్ధి చెందినవి. ఇవి ఉష్ణరక్త జీవులు. వాటితో పోల్చితే.. డైనోసార్లతో సహజీవనం చేసిన ఉభయచరాలు, కొన్ని రకాల పక్షి జాతులు చాలా అల్పమైనవి. గ్రహ శకలం ఢీకొన్నా.. లేదా అగ్నిపర్వతాలు బద్దలైనా వాతావరణంలో తక్షణమే చాలా తీవ్రమైన మార్పులొస్తాయి. విషరసాయనాలు పెద్ద మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ మార్పులకు కేవలం రాక్షసబల్లులు మాత్రమే బలైపోయి, ఉభయచరాలు, పక్షులు మాత్రం ఎలా బయటపడ గలిగాయనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకు కచ్చితమైన సమాధానం దొరకలేదు.

Friday 13 November 2009

ఇంటెక్స్‌ డ్యూయల్‌ సిమ్‌ మొబైల్స్‌


భారతీయ వినియోగదారుల కోసం ఇంటెక్స్‌ కంపెనీ కొత్తగా నాలుగు డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు IN4495,
IN4410, ఐూ80, ఐూ20. వీటిలో IN4495, IN4410 మొబైల్‌ఫోన్లలో రెండు జిఎస్‌ఎం సిమ్‌ కార్డులను ఉపయోగించవచ్చు. IN80, IN20 ఫోన్లలో ఒక జిఎస్‌ఎం సిమ్‌ కార్డు, మరో సిడిఎంఎ సిమ్‌ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లలో ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయో చూద్దామా..

IN4495 మోడల్‌ మొబైల్‌ఫోన్‌లో 6.1 సెం.మీ. QVCA టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతోపాటు కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, ఆడియో అండ్‌ వీడియో ప్లేయర్‌, బ్లూటూత్‌, యుఎస్‌బి పిసి కనెక్టివిటీ, ఆటో వాయిస్‌ రిప్లై, మోషన్‌ సెన్సర్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఇంకా దీని ఎక్స్‌టర్నల్‌ మెమరీని 8 జిబి వరకు పెంచుకోవచ్చు. ఇందులో ఉన్న మరో వినూత్న అంశం ఏమిటంటే.. ఈ ఫోన్‌లో ఉన్న 'పీర్‌ కంట్రోల్‌' అనే ఫీచర్‌ ద్వారా మీరు బయట ఎక్కడైనా ఉన్నా (ఫోన్‌కు దూరంగా ఉన్నప్పుడు) ఓ సింపుల్‌ కోడ్‌ సాయంతో ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేయగలరు. అంతేకాదు ఈ సదుపాయంతో ఇంకా మీరు మీ ఫోన్‌కు సంబంధించి అనేక పనులు చేసుకోగలరు. రెండు రంగుల్లో లభ్యమయ్యే ఈ IN4495 మోడల్‌ మొబైల్‌ ఫోన్‌ ధర రూ.4,200.
ఇక ఇంటెక్స్‌
IN4410 మోడల్‌ డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఇందులో రెండు అంగుళాల వెడల్పైన టిఎఫ్‌టి డిస్‌ప్లేతోపాటు విజిఎ కెమెరా, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో (ఎక్స్‌టర్నల్‌ యాంటెన్నా లేకుండా), ఆడియో అండ్‌ వీడియో ప్లేయర్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 63 ఎంబి వరకు ఇన్‌బిల్ట్‌ మెమరీ ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.3,400.
ఇక ఒక జిఎస్‌ఎం, మరో సిడిఎంఎ సిమ్‌ కార్డులను ఉపయోగించగలిగే.. ఇంటెక్స్‌
IN80 మొబైల్‌ ఫోన్‌లో 6.1 సెం.మీ. ఖగఎఅ రిజల్యూషన్‌ కలిగిన పెద్ద సైజు స్క్రీన్‌, 2 జిబి ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 153.6 ఓఞఛట వేగంతో డేటా డౌన్‌లోడ్‌ చేసుకోగల సౌకర్యంతోపాటు ఎఫ్‌ఎం రేడియో, కెమెరా, యుఎస్‌బి పిసి కనెక్టివిటీ, మోషన్‌ సెన్సర్‌, బ్లూటూత్‌, ఆడియో అండ్‌ వీడియో ప్లేయర్‌ విత్‌ 3.8 ఎంఎం స్టీరియోజాక్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. 7 గంటల వరకు టాక్‌టైమ్‌, 260 గంటలపాటు స్టాండ్‌బై టైమ్‌ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.5,000.
ఇక ఇంటెక్స్‌
IN20 మోడల్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఇదొక మ్యూజికల్‌ ఎడిషన్‌. ఎఫ్‌ఎం రేడియో, ఒన్‌ వే కాల్‌ రికార్డ్‌, మొబైల్‌ ట్రాకర్‌, సౌండ్‌ రికార్డింగ్‌ తదితర సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 1.5 అంగుళాల CSTN డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ 3 గంటల టాక్‌టైమ్‌, 150 గంటల స్టాండ్‌బై టైమ్‌ ఇవ్వగలదు. దీని ధర రూ.1,600.


'విండోస్‌7'కు పైరసీ దెబ్బ!


పైరసీ.. దెబ్బకు ఒక్క సినిమా రంగమే కాదు.. సాఫ్ట్‌వేర్‌ రంగం కూడా తలవంచక తప్పడం లేదు. సాఫ్ట్‌వేర్‌ పైరసీ అనేది చాలాకాలంగా చాపకింద నీరులా సాగిపోతోంది. ఇప్పటి వరకు ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు పైరసీ బారిన పడినా.. తాజా ఉదాహరణ మాత్రం సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇన్‌కార్పొరేషనే. ఏళ్ల తరబడి ఊరించి.. ఊరించి, ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన తన కొత్త ఆపరేటింగ్‌ సిస్టం 'విండోస్‌7' కూడా పైరసీ బారిన పడడాన్ని మైక్రోసాఫ్ట్‌ జీర్ణించుకోలేకపోతోంది.



'విండోస్‌7'కు ఆసియా దేశాలలో పైరసీ దెబ్బ తగలడంతో దానిసృష్టికర్త, సాఫ్ట్వేర్దిగ్గజం.. మైక్రోసాఫ్ట్ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో సాఫ్ట్వేర్ను ఇదివరకేవిడుదల చేసిన మైక్రోసాఫ్ట్కొన్ని దేశాలలో మాత్రం విడుదలనుకొద్దిగా వాయిదా వేసుకుంది. అలాంటి దేశాలలో మన దేశంకూడా ఒకటి. సరిగ్గా అంశమే.. సాఫ్ట్వేర్పైరసీదారుల పాలిటవరంగా మారింది. సాఫ్ట్వేర్విడుదల కానీ దేశాల్లో సైతం పైరసీసాఫ్ట్వేర్డివిడిలు కుప్పలు తెప్పలుగా పుట్టుకురావడం, రూ.50కే 'విండోస్‌7' పైరసీ డివిడి లభించడం గమనించినమైక్రోసాఫ్ట్మిగిలిన దేశాలలో కూడా హడావిడిగా సాఫ్ట్వేర్నువిడుదల చేసింది. ఫలితంగా భారత దేశంలో గత గురువారమేవిండోస్‌7' విడుదలైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చాలావరకు జరిగిపోయింది. మన దేశంలో ఇప్పటికే చాలా రోజులుగా సాఫ్ట్వేర్పైరసీ డివిడిలు చాటుమాటుగాలభిస్తున్నాయి.
సాప్ట్వేర్పైరసీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా సాగిపోతున్నప్పటికీ.. ఎన్నో ఏళ్లు శ్రమించి, విడుదల చేసినతన సాఫ్ట్వేర్‌.. అధికారికంగా విడుదల కాని దేశాల మార్కెట్లలో సైతం కనిపిస్తుండడం, మరీ రెండు డాలర్లకంటే తక్కువధరకు లభిస్తుండడంతో మైక్రోసాఫ్ట్దిగ్భాంతికి గురవుతోంది. పైరసీ బాధను తట్టుకోలేకే గతంలో తన 'ఆఫీస్‌' సాఫ్ట్వేర్ను చైనాలో రూ.1.360కే విక్రయించేందుకు కూడా సిద్ధమైంది. తాజాగా 'విండోస్‌7' కూడా పైరసీ బారిన పడడంతోచైనాలో దీని ధర మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు.

మొత్తానికి తన తాజా ఆపరేటింగ్సిస్టంకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన స్పందనను బేరీజు వేసుకున్న మైక్రోసాఫ్ట్భారతదేశంలో సాఫ్ట్వేర్ను 40 శాతం తగ్గింపు ధరకే విక్రయించేందుకు సిద్ధమైంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగారూ.10,271 ఉన్న 'విండోస్‌7 - హోమ్ప్రీమియం సాఫ్ట్వేర్‌' ధరను మన దేశంలో మాత్రం 40 శాతం తగ్గించిరూ.6,799గా కంపెనీ నిర్ణయించింది. అలాగే హోమ్బేసిక్వెర్షన్రూ.5899, ప్రొఫెషనల్వెర్షన్రూ.11,199, ప్రొఫెషనల్ప్రీమియం(అల్టిమేట్‌) వెర్షన్రూ.11,799కి లభించనున్నాయి.

నిజానికి విండోస్‌ 7 ఆపరేటింగ్సిస్టం విడుదలను మన దేశంలో మైక్రోసాఫ్ట్వాయిదా వేయడానికి బలమైన కారణమేఉంది. మన దేశంలో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త బడ్జెట్అమలులోకి వస్తుండడం, బడ్జెట్లో సాఫ్ట్వేర్లపై విధించే పన్నులోమార్పులు జరిగే అవకాశం ఉండడంతో దీనిని దృష్టిలో ఉంచుకుని మన దేశంలో సాఫ్ట్వేర్ను కాస్త ఆలస్యంగా విడుదలచేయాలని మైక్రోసాఫ్ట్భావించింది. అయితే పైరసీ బెడద కారణంగా తన వ్యూహం మార్చుకుని వెంటనే విడుల చేసింది. అంతేకాదు.. కొన్ని దేశాలలో విండోస్‌7 లైసెన్స్డ్సాఫ్ట్వేర్డివిడి కొన్న వినియోగదారులకు రూ.2600 విలువ కలిగినరిబాక్షూ'ను ఉచితంగా అందజేస్తామంటూ మైక్రోసాఫ్ట్భాగస్వామ్య సంస్థలు ఆఫర్ప్రకటించాయి. అయితే ఆన్లైన్లోకంపెనీని సంప్రదించిన వారం రోజుల్లోగా సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

మరోవైపు తక్కువ ధరకే లభిస్తోంది కదాని 'విండోస్‌7' పైరసీ డివిడి కొన్న వినియోగదారులకు సాఫ్ట్వేర్ఆప్డేషన్సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని మైక్రోసాఫ్ట్భావిస్తుండగా, పైరసీదారులు మాత్రం ఇబ్బందినీ అధిగమించేందుకు అనువైన అవకాశాల గురించి అన్వేషించడంలో తలమునకలవుతుండడం విశేషం.
‌‌‌ ‌ ‌ ‌ ‌‌ ' ‌ ‌ ‌‌ ‌‌ ‌ ‌‌ ‌ ‌ ‌‌‌ ‌‌ ‌‌ '‌‌ ‌‌‌‌‌

Thursday 5 November 2009

'నెట్‌' విరిగి భాషలో పడ్డాక..


'రొట్టె విరిగి నేతిలో పడ్డాక..' అనే సినిమా పాట ఆ రోజుల్లో ఎందరి నోళ్లలో నానిందో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం 'నెట్‌ విరిగి భాషలో పడ్డాక..' అనే పాట ఆన్‌లైన్‌ వీధుల్లో మోగిపోతోంది. దీనికి కారణం.. వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లను ఇకమీదట ఎవరి భాషల్లో వారు పెట్టుకోవచ్చంటూ ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ఐకాన్‌) ఇటీవల సియోల్‌లో కీలక నిర్ణయం తీసుకోవడమే. ఐకాన్‌ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని.. ఇంటర్నెట్‌ పుట్టి, బుద్ధి ఎరిగిన తరువాత.. ఇన్నేళ్లకు ఏకంగా ఇంటర్నెట్‌ దశను మార్చివేసే ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు 'నెట్‌' నిపుణులు.

కమీదట ఇంటర్నెట్‌లో 'పిచ్చి పుల్లయ్య డాట్‌ కాం', 'వెర్రి వెంగళప్ప డాట్‌ నెట్‌'.. లాంటి పేర్లు కనిపిస్తే ఆశ్చర్యమేం లేదు. ఎదుకంటే వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లు ఏ భాషలోనైనా పెట్టుకోవచ్చంటూ ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ఐకాన్‌) సంస్థ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇంటర్నెట్‌ వాడకందార్లు.. ముఖ్యంగా వెబ్‌సైట్ల నిర్వాహకులకు ఓ శుభవార్త! నిజానికి ఇన్నాళ్లూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటూ వస్తున్నాయి. ఇంగ్లీషు రాని వాళ్లకు ఇది ఎంతో ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడిక ఈ ఇబ్బంది తొలగిపోనుంది. ఒక్క తెలుగు మాత్రమే కాదు హిందీ, తమిళం, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీతోపాటు రష్యా, చైనా, అరబిక్‌ భాషల్లో కూడా వెబ్‌సైట్‌ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 'ఐకాన్‌' తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం మొత్తానికి ఇంటర్నెట్‌ స్థితిగతులనే మార్చివేయనుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మారుమూలకు వెబ్‌'సైట్‌'..
గ్రామీణ ప్రాంతాలకు వెబ్‌ వెలుగులు నేటికీ పూర్తిగా చేరలేదు. ఫలితంగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ శాతం కూడా అక్కడ తక్కువే. వెబ్‌సైట్ల డొమైన్‌ పేర్లు (చిరునామాలు) అధిక భాగం అంగ్లంలో ఉన్న కారణంగా ఆ భాష తెలియని వారు తమ గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లేవారు కారు. భారతీయ భాషలకు సంబంధించిన వెబ్‌సైట్లు, బ్లాగులు ఎన్నో ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఉన్నప్పటికీ వాటి డొమైన్‌ పేర్లు ఆంగ్లంలో ఉండడం వల్ల ఆ భాష రాని వారికి వాటి గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ డొమైన్‌ పేర్లు కూడా భారతీయ భాషల్లో పెట్టుకోగలిగే అవకాశాన్ని 'ఐకాన్‌' కల్పించడంతో ఇకముందు ప్రాంతీయ భాషలు తెలిసిన ప్రతి ఒక్కరూ వెబ్‌లో వీరవిహారం చేసేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.
పెరగనున్న సంఖ్య..
ఐకాన్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయం పరోక్షంగా ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ల పెరుగుదలకు దోహదపడనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారు 160 కోట్ల మంది. వీరిలో సగానికి సగం మంది ఆంగ్ల భాష ఎరుగని వారే. వీరిలో ఎంతోమందికి సొంతగా వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఇంగ్లీష్‌ రాని కారణంగా వెనకడుగు వేస్తున్న వారు ఎందరో. వెబ్‌ లేదా బ్లాగ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలు మొత్తం ఆంగ్లంలోనే జరపాల్సి రావడం, అలాగే ఈ-మెయిల్‌ కూడా ఆంగ్లంలోనే ఇవ్వాల్సి వస్తుండడం వంటి ఇబ్బందులు వెనక్కి లాగుతున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తే బ్రౌజర్లకు ఇంతకాలం ఉన్న ఇబ్బందులు తొలగిపోవడమేకాక మాతృభాషలో ఈ-మెయిల్స్‌ పంపుకోగలిగే వీలు కూడా కలుగుతుంది.
ఇబ్బందులూ అనేకం..
అయితే వెబ్‌ డొమైన్‌లలో కొత్త కొత్త పేర్లు వచ్చి చేరడం వల్ల అయోమయంతోపాటు భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదనేది నెట్‌ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజిన్లను కూడా ప్రభావితం చేయనుంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ప్రస్తుతం ఆంగ్లం మాత్రమే కాకుండా కొరియన్‌, అరబిక్‌ భాషల్లోనూ సెర్చ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఐకాన్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్క సెర్చ్‌ ఇంజిన్‌లు మాత్రమే కాకుండా ఈ-మెయిల్‌ ప్రొవైడర్లు కూడా అనేక భాషల్లో తమ సేవలను అందించాల్సి వస్తుంది.
కీబోర్దు కిరికిరి..
ఎవరికి వారు వారి వారి భాషల్లో వెబ్‌సైట్ల డొమైన్‌ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం వినియోగంలో ఉన్న కంప్యూటర్‌ కీబోర్డులు వాటికి ఏ విధంగా సహకరిస్తాయనేది ప్రధాన ప్రశ్న. కంప్యూటర్లను తయారుచేసే కంపెనీలన్నీ ఆల్ఫాబెటికల్‌(ఎ,బి,సి,డి...లు) ఆర్డర్‌లో ఉన్న కీ బోర్డులను సరఫరా చేస్తున్నాయి. అలాంటప్పుడు వీటిపై జపనీస్‌, అరబిక్‌, గ్రీక్‌, హిబ్రూ తదితర యూరోపియన్‌ భాషలు టైప్‌ చేయడం ఎలా? ఒకవేళ ఆయా భాషల్లో కీబోర్డులు తయారైనా వాటిని ఉపయోగించి మరో భాషలో ఉన్న అక్షరాలను ఎలా టైప్‌ చేయగలం? పోనీ ఎవరి మాతృభాషకు సంబంధించి వారు 'వర్చువల్‌ కీ బోర్డులు' డౌన్‌లోడ్‌ చేసుకున్నా ఆంగ్ల అక్షరాలు కలిగి ఉన్న కీ బోర్డు ద్వారా వాటిని ఉపయోగించడం ఎలా?
ఇవన్నీ ప్రస్తుతానికి మాత్రమే సమస్యలు. వీటికి తగిన సమాధానాలు ఇవ్వగలిగేది భవిష్యత్తు ఒక్కటే!



Sunday 1 November 2009

ఇక వెబ్‌ డొమైన్‌ పేర్లు.. ఏ భాషలోనైనా!

ఇకమీదట ఇంటర్‌నెట్‌లో 'పుల్లయ్య డాట్‌ కాం', 'వెర్రి వెంగళప్ప డాట్‌ కాం'.. లాంటి పేర్లు కనిపిస్తే.. ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ఏ భాషలోనైనా డొమైన్‌పేర్లు సృష్టించుకునేందుకు వీలు కల్పిస్తూ ఇంటర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ (ఐకాన్‌) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ వాడకందారులందరికీ ఆన్‌లైన్‌ చిరునామాలను కేటాయించేది ఈ సంస్థే.

వెబ్‌సైట్‌ డొమైన్‌ పేర్లు ఇన్నాళ్లూ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటూ వస్తున్నాయి. ఇకపై ప్రపంచంలోని ఏ భాషలోనైనా డొమైన్‌ పేర్లు పెట్టుకోడానికి అనుమతించాలని సియోల్‌లో జరిగిన ఓ సమావేశంలో 'ఐకాన్‌' నిర్ణయించింది. ఇంగ్లీషు రాని వాళ్లు ఇంటర్‌నెట్‌ చూడాలంటే ఇన్నాళ్లూ ఉన్న ఇబ్బంది దీంతో తొలగిపోనుంది. ఇంటర్‌నెట్‌ వాడకందారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'ఐకాన్‌' ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాడ్‌ బెక్‌స్ట్రామ్‌ తెలిపారు. ప్రధానంగా ఆసియా, మధ్యప్రాచ్యం, రష్యాలాంటి ప్రాంతాలకు ఇది ఉపయోగకరమన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ను వాడుతున్నారని, వీరిలో సగానికిపైగా ఇంగ్లీషేతర భాషల్లో రాస్తారని.. అందువల్ల ఈ మార్పు తప్పనిసరి అయ్యిందని రాడ్‌ బెక్‌స్ట్రామ్‌ వివరించారు. ఇంటర్నెట్‌ వ్యవస్థలో ఇదొక చారిత్రక అడుగుగా ఆయన అభివర్ణించారు. ఈనెల16వ తేదీ నుంచి ఇది వివిధ దశల్లో అమలు కానుందని 'ఐకాన్‌' వర్గాలు పేర్కొన్నాయి.

Saturday 31 October 2009

కంప్యూటర్‌ కాదు.. మొబైల్‌ఫోనే!


హైలైట్...
120 జిబి హార్డ్‌డిస్క్‌, 1జిబి ర్యామ్‌, 4.8 అంగుళాల డిస్‌ప్లే, పూర్తిస్థాయి టచ్‌స్క్రీన్‌, క్యూవెర్టీ కీబోర్డ్‌


ఇకమీదట మీరు మీ పనులన్నీ మొబైల్‌తోనే చక్కబెట్టుకోవచ్చు. మీ వ్యక్తిగత పనులు, ఆఫీసు పనులు అన్నీ జస్ట్‌.. మీ వేళ్ల కదలికలపై జరిగిపోతాయి. మరో మాటలో చెప్పాలంటే ఇది ఫోన్‌ కాదు.. బుల్లి కంప్యూటర్‌. ఇలాంటి మొబైల్‌ఫోన్‌ను చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీనిపేరు ఎక్స్‌పీ ఫోన్‌. ఇప్పుడు మొబైల్‌ఫోన్ల రంగంలో ఇదో పెద్ద సంచలనం.

చాలా కొద్దిరోజుల్లోనే మీరు ఓ పర్సనల్‌ కంప్యూటర్‌ను మీ జేబులో వేసుకుని తిరగొచ్చు. అది సరిగ్గా మీ మొబైల్‌ ఫోన్‌ సైజులో ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇంకా దీని గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టడం ఖాయం. చైనాకు చెందిన మొబైల్‌ఫోన్ల తయారీదారు ఇన్‌ టెక్నాలజీ గ్రూప్‌(ఐటిజి) కంప్యూటర్‌లాంటి ఈ అద్భుత మొబైల్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పర్సనల్‌ కంప్యూటర్లలో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఈ 3జి (థర్డ్‌ జనరేషన్‌) ఫోన్‌లో ఉంటాయి. 4.8 అంగుళాల ఫుల్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ ప్రత్యేకత. అంతేకాదు.. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల మాదిరిగా ఈ ఫోన్‌లో 120 గిగాబైట్‌ల స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. అలాగే 1 జిబి ర్యామ్‌ కూడా. 'అబ్బ.. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఓ కీబోర్డు కూడా ఉంటే ఇంకా బాగుండేది..' అనుకుంటున్నారా? ఆగండి.. అక్కడికే వస్తున్నాం. ఈ స్లయిడర్‌ ఫోన్‌ అడుగుభాగాన 'క్యూవెర్టీ' కీబోర్డు కూడా అమర్చారు. ఇంకేం కావాలి? ఎంత పెద్ద మెసేజ్‌లైనా కంప్యూటర్‌ కీబోర్డుపై టకటకలాడించినట్లు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. చూపులకు చిన్నగా ఉన్నా పనితనంలో మాత్రం ఈ ఎక్స్‌పీ మొబైల్‌ యమ ఫాస్ట్‌. ఎలాగంటే కంప్యూటర్లలో ఉన్న మాదిరిగానే ఇందులో ఎఎండి ప్రాసెసర్‌, మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం ఉంటాయి మరి. అంతేనా? ఇంకా ఇందులో.. 1.3 మెగాపిక్సెల్‌ కెమెరా, జిపిఎస్‌ నావిగేషన్‌, బ్లూటూత్‌, యుఎస్‌బి అండ్‌ విజిఎ సపోర్ట్‌.. ఇలా ఆధునిక తరానికి కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి. ఇవే కాకుండా.. హై స్పీడ్‌ డౌన్‌లింక్‌ పాకెట్‌ యాక్సెస్‌ (హెచ్‌ఎస్‌డిపిఎ), హై స్పీడ్‌ అప్‌లింక్‌ పాకెట్‌ యాక్సెస్‌ (హెచ్‌ఎస్‌డిపిఎ) తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకో సదుపాయం గురించి చెబితే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ ఎక్స్‌పీ ఫోన్‌ను కేవలం జిఎస్‌ఎం వినియోగదారులు మాత్రమే కాదు.. సిడిఎంఎ వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌ రెండు రకాల నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుందన్నమాట. ఇక టాక్‌టైమ్‌ విషయనికొస్తే.. ఒకసారి బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుని అయిదు గంటలపాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. ఫోన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచితే అయిదు రోజులపాటు ఉంటుంది. మరి ఇంతకన్నా అద్భుతమైన ఫోన్‌ ఇంకోటి ఉంటుందా? ప్రస్తుతం ఈ ఫోన్‌ ప్రి-ఆర్డర్‌ (ముందుగా ఆర్డర్‌ చేసి తెప్పించుకోవడం) ద్వారా మాత్రమే లభిస్తోంది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు, ఆర్డర్‌ చేసే విధానం తెలుసుకుకోవాలంటే http://www.xpphone.com/en/index.htmlలో చూడాల్సిందే.

ల్యాప్‌టాప్స్‌ విత్‌ Windows 7


డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనొవో తన థింక్‌ప్యాడ్‌ శ్రేణిలో కొత్తగా రెండు ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి విడుదల చేసిన 'విండోస్‌-7' ఆపరేటింగ్‌ సిస్టంను కలిగి ఉండడం ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకత. వీటి పేర్లు థింక్‌ప్యాడ్‌ ఎస్‌ఎల్‌ 410, థింక్‌ప్యాడ్‌ ఎస్‌ఎల్‌ 510. ఎస్‌ఎల్‌ 410 మోడల్‌ థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల డిస్‌స్లే స్క్రీన్‌ సైజుతో లభిస్తుండగా, ఎస్‌ఎల్‌ 510 మోడల్‌ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ సైజు 15.6 అంగుళాలు. 3జి(థర్డ్‌ జనరేషన్‌) పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ల్యాప్‌టాప్‌లు రెండిట్లోనూ హై రిజల్యూషన్‌ కెమెరా నిక్షిప్తం చేయబడి ఉండడమేకాక ఎటి అండ్‌ టి మొబైల్‌ బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కూడా ఉంటుంది. వ్యాపార వార్గాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ల్యాప్‌టాప్‌ల ధరలు వరుసగా రూ.23,457.. రూ.32,840.


ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు.. ఇలా!


ఏళ్ల తరబడి Windows Xp ఆపరేటింగ్‌ సిస్టంపై పనిచేసి బోర్‌ కొడుతుందా? సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవల విడుదల చేసిన కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7కు మారాలని భావిస్తున్నారా? అయితే Windows Xp నుంచి Windows 7కు ఎలా మారాలో మేం చెబుతాం. ఫాలో అవండి మరి!

ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోదారులందరూ ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌-7 విజయవంతంగా మార్కెట్లోకి విడుదలైంది. 2000 సంవత్సరంలో విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం విడుదల తర్వాత మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో సమర్ధమంతమైన ఆపరేటింగ్‌ సిస్టం మార్కెట్లోకి రాలేదనే చెప్పాలి. రెండేళ్ల క్రితం మరో ఆపరేటింగ్‌ సిస్టం Windows Vista వచ్చినా.. కంప్యూటర్‌ వినియోగదారులను ఆకట్టుకోవడంలో, వారి అవసరాలు తీర్చడంలో అది దాదాపు విఫలమైనట్లే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోగదారులందరూ మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టం విండోస్‌-7పైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్న వారంతా కొత్తగా వచ్చిన విండోస్‌-7కు మారడానికి ఇదే సరైన తరుణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు ఎలా మారాలో చూద్దాం.

Memory ప్రధానం..
విండోస్‌-7 సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజి మీరు కొన్నట్లయితే, అందులో 32-బిట్‌, 64-బిట్‌ ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌లు రెండు ఉంటాయి. వీటిలో 64-బిట్‌ సాఫ్ట్‌వేర్‌ చాలా కంప్యూటర్లకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే మీ కంప్యూటర్‌లో కనీసం 4 జిబి మెమరీ ఉండాలి. అంత మెమరీ లేని వారు 32-బిట్‌ ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను ఎంచుకోవడం మంచిది.

ఇలా చెక్‌ చేయండి..
మీ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ గురించి మీకు కచ్చితంగా తెలియనప్పుడు, కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7 మీ కంప్యూటర్‌లో లోడ్‌ అవుతుందో లేదో తెలుసుకునేందుకు ఇలా చేయండి. మీ కంప్యూటర్‌ డెస్క్‌టాప్‌పైన కనిపించే My Computer ఐకాన్‌పై మీ మౌస్‌ పాయింటర్‌ను ఉంచి రైట్‌ బటన్‌ క్లిక్‌ చేసిPropertiesను సెలక్ట్‌ చేసుకోండి. అక్కడ కనిపించే సమాచారంలో "x64 Edition" అని కనిపిస్తే మీరు మీ కంప్యూటర్‌లో 64-బిట్‌ వెర్షన్‌ విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్నారని అర్థం. లేదంటే మీ కంప్యూటర్‌ 32-బిట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టంను కలిగి ఉందని అర్థం. అక్కడ మీకు ఏది కనిపిస్తే కొత్త ఆపరేటింగ్‌ సిస్టంలో కూడా దానికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను మాత్రమే ఎంచుకోండి. మీరు ఏ బిట్‌ వెర్షన్‌ ఉపయోగిస్తున్నారన్నదానిపై మీకు స్పష్టత లభించకపోతే మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి free Windows 7 Upgrade Advisorను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని రన్‌ చేసి చూడండి. ఆపైన Windows 7కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు మీ సిస్టంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో Upgrade Advisor మీకు తెలియజేస్తుంది.

Backup ముఖ్యం..
విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకునే ముందు మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్‌, ఫోల్డర్స్‌ను వేరొక లొకేషన్‌లో భద్రంగా పదిలపరచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. దీనికోసం Windows Easy Transfer Application ను మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత తిరిగి మీ బ్యాకప్‌ ఫైల్స్‌ను చాలా సులువుగా మీ కంప్యూటర్‌లోకి తీసుకురావచ్చు. ఈ పద్ధతి వద్దనుకుంటే మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్‌, ఫోల్డర్స్‌ అన్నింటినీ సీడీ, డివిడి, యుఎస్‌బి ఫ్లాష్‌డ్రైవ్‌, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌.. వీటిలో ఏదో ఒకదానిలో వాటిని భద్రపరుచుకోవచ్చు.

ఇంటర్నెట్‌ అవసరం..
కొత్త ఆపరేటింగ్‌ సిస్టం Windows 7ను ఇన్‌స్టాలేషన్‌ చేసుకోవడానికి ముందుగానే మీ కంప్యూటర్‌ను ఇంటర్నెట్‌తో అనుసంధానించండి. ఆ తరువాతే మీ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజిలో ఉన్న 32-బిట్‌ లేదా 64-బిట్‌ ఈ రెండింటిలో మీ కంప్యూటర్‌కు ఏది సరిపోతుందో ఎంపిక చేసుకోండి.

ఇన్‌స్టాలేషన్‌ ఇలా..
ఎంచుకున్న విండోస్‌ 7 ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ను మీ సిపియుకు ఉన్న డిస్క్‌డ్రైవ్‌లో ఉంచి సెటప్‌ను ఒకే చేస్తే ఇన్‌స్టాలేషన్‌ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే.. .. Start Menuలోకి వెళ్లి My Computer ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. వచ్చిన విండోలో కనిపించే డివిడి డ్రైవ్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. వచ్చే మరో విండోలో కనిపించే setup.exe ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. దీంతో ఇన్‌స్టాలేషన్‌ మొదలవుతుంది.
తరువాత Install Windows Page పేరుతో ఓ విండో ఓపెన్‌ అవుతుంది. అందులో కనిపించే Install Now అనే బటన్‌పై క్లిక్‌ చేయండి. వెంటనే ఎటువంటి ఇన్‌స్టాలేషన్‌ను మీరు కోరుతున్నారు? అనే ప్రశ్న వస్తుంది. అందులో Custom అనే ఆప్షన్‌ను ఎంచుకుని దానిపై క్లిక్‌ చేయండి. వచ్చే విండోలో Windows Xp Partition Containingను ఎంచుకుని, Next బటన్‌ను క్లిక్‌ చేయండి. మరో డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. దానిపై OK బటన్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

బ్యాకప్‌ ఫైల్స్‌ను తెచ్చుకోవడం..
కొత్త ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ పూర్తయిన తర్వాత Windows Easy Transfer Applicationను మరోసారి రన్‌ చేసుకోండి. ఫైల్స్‌, సెట్టింగ్స్‌ను కంప్యూటర్‌లోకి తీసుకురండి. ఈ అప్లికేషన్‌ను రన్‌ చేసే ముందుగానే ప్రోగ్రామ్స్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఎందుకంటే Windows Easy Transfer Application మీ ఫైళ్లను ఇంతకు మందు అవి ఏ ఏ ప్రోగ్రామ్స్‌లో అయితే ఉన్నాయో, అవే స్థానాల్లోకి తీసుకొస్తుంది. ఒకవేళ మీ బ్యాకప్‌ ఫైల్స్‌ ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌లో ఉన్నట్లయితే దాన్ని మొదట మీ కంప్యూటర్‌కు అనుసంధానించండి. తరువాత Start Menu లోకి వెళ్లి కడ My Computer ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేయండి. ఆపైన కనిపించే ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ ఐకాన్‌పై డబుల్‌ క్లిక్‌ చేసి దానిని ఓపెన్‌చేయండి. అందులో కనిపించే Windows Easy Transfer Application ను మరోసారి రన్‌ చేసి ఏఏ ఫైళ్లను ఎక్స్‌పీ నుంచి విండోస్‌ 7కు తీసుకురావాలో ఎంపిక చేసుకుని, వాటిని ఒకే చేసుకుంటే మీరనుకున్న పని పూర్తవుతుంది.

సెట్టింగ్స్‌, ఫైళ్లు కంప్యూటర్‌లోకి వచ్చిన వెంటనే ప్రోగ్రామ్స్‌ను రీ-ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఒకసారి అప్‌డేషన్‌ను చెక్‌ చేసుకోండి. దీంతో విండోస్‌ -7 ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ సంపూర్ణం అయినట్లే!


Wednesday 21 October 2009

ఇ-బుక్‌ రీడర్‌.. మీ దగ్గర ఉందా?


ఇ-బుక్‌ రీడర్లు పుస్తక ప్రియలకు చదవడాన్ని చాలా సులువైన ప్రక్రియగా మార్చేశాయి. చేతిలో ఇమిడిపోవడంతోపాటు చదువుతూనే పాటలు వినగలగడం ఇందులో ఉన్న ఆకర్షణీయమైన అంశాలు. పుస్తకం పాడైపోతుందన్న బాధలేదు. బరువు తక్కువ, వందలకొద్దీ పుస్తకాలను చిన్న పరికరంలో నిక్షిప్తం చేసుకోగల సౌలభ్యం.. వెరసి పాఠకులకు ఇదొక హాట్‌ పరికరంగా మారిందంటే ఆశ్యర్యం లేదు. అందుకే ఐదు ఉత్తమ ఇ-బుక్‌ రీడర్ల విశేషాలను మీకోసం అందిస్తున్నాం...

అమెజాన్‌ కిండిల్‌
ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీ 'అమెజాన్‌ డాట్‌కాం' రూపొందించిన వైర్‌లెస్‌ డిజిటల్‌ ఇ-బుక్‌ రీడర్‌ ఇది.
కిండిల్‌ సిరీస్‌లో ఇప్పటికే కిండిల్‌-1, కిండిల్‌-2, కిండిల్‌-ఈగీ విడుదల అయ్యాయి. ఇ-ఇంక్‌ స్క్రీన్‌ గల ఈ రీడర్‌ ఫొటోలను సహజమైన నాణ్యతతో చూపించగలుగుతుంది. అలాగే చదవడానికి చాలా సౌకర్యంగా ఉంటుందని అమెజాన్‌ పేర్కొంది.
కంప్యూటర్‌ అవసరం లేకుండానే డిజిటల్‌ పుస్తకాలు, మ్యాగజైన్లను ఇందులోకి డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. ఇ-పుస్తకాలను కూడా అమెరికా నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వికీ
పీడియాలాంటి ముఖ్యమైన సైట్లను బ్రౌజ్‌ చేసుకునే సదుపాయం మాత్రం ప్రస్తుతానికి ఇందులో లేదు. దీని ధర రూ.12,898. ఇంత «ధర అయితే కష్టం అనుకునే వారు 'రిఫర్‌బిష్‌డ్‌ కిండిల్‌' కొనుక్కోవచ్చు. అంటే.. ఒకసారి మార్కెట్‌లోకి వచ్చి ఏదైనా కారణం చేత తిరిగి కంపెనీకి చేరిన ఇ-పుస్తకమన్నమాట. ఇలాంటి వాటిలో లోపాలను సరిచేసి మళ్లీ కొత్త వాటిలా మార్చుతారు. కొత్త వాటికి ఇచ్చినట్లుగానే వీటికీ వారంటీ ఉంటుంది. ధర కూడా చాలా తక్కువ. ఈ రిఫర్‌బిష్‌డ్‌ ఇ-రీడర్ల ధరలు.. కిండిల్‌1-రూ.6,869, కిండిల్‌2-రూ.10,130, కిండిల్‌ ఈగీ -రూ.18,504.

సోనీ రీడర్‌ టచ్‌
మెటల్‌తో స్లిమ్‌గా రూపొందించారు. ఇది సోనీ నుంచి వెలువడిన తొలి టచ్‌స్క్రీన్‌ ఇ-బుక్‌ రీడర్‌. పేజీలను తేలికగా ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. ఇమేజ్‌లను పెద్దవిగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు చదువుతూనే ఎంపి3 ట్యూన ్లను వినవచ్చు.
పుస్తకాలను సెర్చ్‌ చేసుకునే సదుపా
యం కూడా ఉంది. అయితే ఇందులోకి పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మాత్రం కంప్యూటర్‌ ఉండాల్సిందే. దీని ధర రూ.18,830.
కూల్‌-ఇఆర్‌
ఇది అనేక పుస్తకాల సమాహారం. అమెజాన్‌ కిండిల్‌, సోనీ రీడర్‌ కన్నా ఇది తక్కువ ధరలోనే లభిస్తుంది. ఇందులో కంట్రోల్‌ బటన్లు చాలా చిన్నవిగా ఉంటాయి. పేజీలను పూర్తిగా తిప్పుకోలేకపోవడం దీనిలో ఉన్న లోపం. కీబోర్డ్‌ సహకారం లేకుండా పుస్తకాల్లోని పేజీలను, పదాలను సెర్చ్‌ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సిందే. స్క్రీన్‌ నాణ్యత కూడా తక్కువ. దీని ధర మాత్రం రూ.14,311.

ఎలోనెక్స్‌ ఇ-రీడర్‌
చాలా స్టైల్‌గా ఉంటుందీ రీడర్‌. షేక్‌స్పియర్‌, డికెన్స్‌, ఆస్టెన్‌ తదితర రచనలు వంద వరకూ ఇందులో ముందుగానే నిక్షిప్తం చేయబడి ఉంటాయి. స్క్రీన్‌ కూడా అందంగా, చదవడానికి సౌకర్యంగా ఉంటుంది. అయితే ఎక్కువ రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలు అంత నాణ్యంగా కనిపించకపోవడం
ఇందులోఉన్న లోపం. తక్కువ సమయంలో ఆన్‌ కావడం, బోలెడన్ని ఎంపి3 పాటలను స్టోర్‌ చేసుకోగల సామర్ధ్యం దీని అదనపు ఆకర్షణలు. దీని ధర రూ.12,802.

యాపిల్‌ ఐపాడ్‌ టచ్‌
ఇది మినీ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. వేలకొద్దీ అప్లికేషన్‌లను ఇందులో ఉపయోగించవచ్చు. 3.5 అంగుళాల కలర్‌ టచ్‌స్క్రీన్‌ దీని ప్రత్యేకత. ఇ-బుక్‌లను బ్రౌజ్‌ చేసుకోవడంతోపాటు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపి3, వీడియో సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే స్క్రీన్‌ చిన్నగా ఉండడం ఇందులో ప్రధాన లోపం. దీని ధర రూ.11,221.

ఈ ఐదు ఇ-బుక్‌ రీడర్లలో యాపిల్‌ ఐపాడ్‌ టచ్‌ను మినహాయిస్తే మిగతావాటన్నింటిలో ఆరు అంగుళాల మోనోక్రోమ్‌ ఇ-ఇంక్‌ డిస్‌ప్లే ఉంది. సాధారణ ఎల్‌సిడి స్క్రీన్‌ కంటే ఇందులో చదవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
---------------------------------------------------------

HTC Touch2 వచ్చేసింది!



ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న HTC Touch2 మొబైల్‌ ఫోన్‌ భారత మార్కెట్‌లోకి రానే వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 6.5 అప్లికేషన్‌తో భారత దేశంలో విడుదలైన మొట్టమొదటి GSM ఫోన్‌ ఇది.

ఈ విండోస్‌ 6.5 అప్లికేషన్‌లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మొబైల్‌ విత్‌ ఫ్లాష్‌ సపోర్ట్‌, మై ఫోన్‌ బ్యాకప్‌ సర్వీస్‌, మైక్రోసాఫ్ట్‌ ఎక్స్ఛేంజ్‌ సపోర్ట్‌, విండోస్‌ మార్కెట్‌ప్లేస్‌ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. 256 ఎంబి ర్యామ్‌, 512 ఎంబి రామ్‌ కలిగిన ఈ మొబైల్‌ 2.8 అంగుళాల థిన్‌ ఫిల్మ్‌ ట్రాన్సిస్టర్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (TFT LCD) కలిగి ఉంటుంది. ఇందులో 3.2 మెగాపిక్సెల్‌ కెమెరా సాయంతో నాణ్యమైన చిత్రాలను తీసుకోవచ్చు. అంతేకాదు, మరో ప్రత్యేక ఫీచర్‌ ఇంటర్నల్‌ జిపిఎస్‌ ఏంటెన్నా మీరు ఫొటో తీసిన ప్రాంతాన్ని గుర్తిస్తుంది. బ్లూటూత్‌ 2.1, వైఫై, థర్డ్‌ జనరేషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని 1100 mAh బ్యాటరీతో 2G పరిజ్ఞానం కలిగిన ఫోన్లతో ఏడున్నర గంటలపాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. అలాగే 3G పరిజ్ఞానం కలిగిన ఫోన్లతో అయితే ఆరు గంటలపాటు మాట్లాడుకోవచ్చు. కంప్యూటర్లలో ఉన్నట్లుగానే HTC Touch2 మొబైల్‌లో పాకెట్‌ ఆఫీస్‌ ఉంటుంది. దీని ద్వారా వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, ఒన్‌ నోట్‌, పిడిఎఫ్‌ వంటి అప్లికేషన్‌లు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌ అధీకృత సరఫరాదారు రిలయన్స్‌ మాత్రమే. అంటే కేవలం రిలయన్స్‌ మొబైల్‌ వారి వద్ద మాతమ్రే లభిస్తుందన్నమాట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ HTC Touch2 వ్యాట్‌ పెరిగిన కారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో రూ.24,490కు, మిగిలిన రాష్ట్రాలలో రూ.22,490కు లభిస్తుంది.

Wednesday 14 October 2009

భూగోళం భవిష్యత్తు..'350' గుప్పెట్లో!


వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం.. వర్షాకాలంలో వర్షాలు పడకపోవడం.. నదులు ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లను ముంచేయడం.. ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరగడం.. అక్కడి జంతుజాలం అంతరించిపోవడం.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుసా? ఈ మార్పులన్నింటికీ కారణం వాతావరణ కాలుష్యమే. అవును, వాతావరణంలోకి నిరంతరాయంగా వెలువడుతున గ్రీన్‌హౌస్‌ వాయువుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ గ్రీన్‌ హౌస్‌ వాయువులలో కార్బన్‌డయాక్సైడ్‌ కూడా ఒకటి. వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ 350 పిపిఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉన్నంత వరకే మనం ఈ భూమిపై సురక్షితంగా జీవించగలం. కానీ ఇప్పుడు ఈ కార్బన్‌డయాక్సైడ్‌ 387 పిపిఎంకు చేరుకుంది. అంటే.. మనం నివసిస్తున్న ఈ భూగోళం పెను ప్రమాదంలో పడిందన్నమాట!
ఎందుకిలా?
వాతావరణంలో మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలంటే దానికంటే ముందు అసలు గ్రీన్‌హౌస్‌ వాయువులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. నీటి ఆవిరి, కార్బన్‌డయాక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, ఓజోన్‌, హైడ్రోఫ్లోరోకార్బన్స్‌, పర్‌ఫ్లూరోకార్బన్స్‌, సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌ తదితరాలను గ్రీన్‌హౌస్‌ వాయువులుగా పిలుస్తారు. వీటిలో కొన్ని వాయువులు సహజసిద్ధంగా గాలిలో కలుస్తుండగా, మరికొన్ని వాయువులు మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. చెత్తాచెదారం, వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలు, కలపతోపాటు చమురు, సహజ వాయువు, బొగ్గులను మండించడం వల్ల వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ మీథేన్‌ తదితర వాయువులు విడుదల అవుతున్నాయి.
గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ అంటే..
ఈ గ్రీన్‌ హౌస్‌ వాయువులు వాతావరణంలోని వేడిని గ్రహించడాన్ని 'గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌'గా వ్యవహరిస్తారు. అయితే ఈ వేడిని గ్రహించడంలో అన్ని వాయువుల సామర్థ్యం ఒకేలా ఉండదు. ఉదాహరణకు.. హైడ్రోఫ్లోరోకార్బన్స్‌, పర్‌ఫ్లూరోకార్బన్స్‌కు వాతావరణంలోని వేడిని గ్రహించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. అయితే వాతావరణంలోకి సహజసిద్ధంగా వెలువడే వాయువులు అలా కాదు. కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు కంటే 270 రెట్లు అధికంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు వాతావరణంలోని వేడిని గ్రహిస్తుంది. అలాగే మీథేన్‌ వాయువు 21 రెట్లు అధికంగా వేడిని గ్రహిస్తుంది. విషాదం ఏమిటంటే.. వాతావరణంలో వేడిని గ్రహించే సామర్థ్యం అంతగా లేని కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు అధికంగా వాతావరణంలోకి చేరుతుండడం. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ 350 పిపిఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉన్నంత వరకే ఫర్వాలేదు. కానీ ఇప్పుడు దీని శాతం 387 పిపిఎంకు
చేరుకుంది.
అప్పుడేం జరుగుతుంది?
వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ పరిమాణం విపరీతంగా పెరిగిపోవడం వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతింటుంది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా ఇంకా పెరుగుతుంది. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, వరదలు, కరువులు అధికమవుతాయి. కొత్త కొత్త బ్యాక్టీరియా, వైరస్‌లు పుట్టుకొస్తాయి. కొత్తకొత్త వ్యాధులు ప్రబలుతాయి. ఫలితంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవిస్తుంది. భవిష్యత్తు తరాల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఇప్పుడేం చేయాలి?
ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి మనిషి ముందున్న ప్రశ్న ఇది. దీనికి జవాబు ఒక్కటే. మళ్లీ వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ను వీలైనంత త్వరగా 350 పిపిఎం(పార్ట్స్‌ పర్‌ మిలియన్‌)కు తీసుకురావాలి. భవిష్యత్తులో అంతకంటే పెరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలలో ఆయా దేశాలు వేటికవే పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితం కానరావడం లేదు. దీంతో పర్యావరణ పరిరక్షణ కోసం కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధానం రూపొందించి దాన్ని అమలు చేసేందుకు వచ్చే డిసెంబర్‌లో ప్రపంచ దేశాల నాయకులు, మేధావులు కోపెన్‌హాగన్‌, డెన్మార్క్‌లలో సమావేశం కాబోతున్నారు. డిసెంబర్‌ 7 నుంచి 18 వరకు యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ ఆధ్వర్యంలో 15వ సదస్సు నిర్వహించనున్నారు. 2013-2020 మధ్య కాలానికి సంబంధించి కొత్త విధానానికి రూపకల్పన చేయడం, వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు విడుదల నుంచి భూగోళాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా దేశాల అధినేతలు, రాజకీయ నాయకులపై అవసరమైన ఒత్తిడి తీసుకురావడం వీరి ఉమ్మడి లక్ష్యం.

24న ఏం జరగబోతోంది?
ఈ నెల 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలలో 'గ్లోబల్‌ యాక్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌' పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మన దేశంలో ఈ బాధ్యతను ఇండియన్‌ యూత్‌ క్లైమేట్‌ నెట్‌వర్క్‌ (ఐవైసిఎన్‌) తన భుజస్కందాలపై వేసుకుంది. మన రాష్ట్రంలో ఈ సంస్థకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎపి చాప్టర్‌ వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ సురక్షిత స్థాయులకు గుర్తు అయిన '350'ని ఫోకస్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ప్రతి ఒక్కరి దృష్టి ఈ 350పైన పడేట్లు చేయాలని నిశ్చయించుకుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో చార్మినార్‌, బుద్ధ విగ్రహం, ఐమ్యాక్స్‌ థియేటర్‌, గోల్కొండ తదితర ప్రాంతాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నాలుగైదు రకాల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఇండియన్‌ యూత్‌ క్లైమేట్‌ నెట్‌వర్క్‌ (ఐవైసిఎన్‌) జాతీయ సమన్వయకర్త చైతన్య, ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రాంతీయ సమన్వయకర్త ఎం.రంగప్రసాద్‌లు పేర్కొన్నారు. ఇందుకోసం తాము తొమ్మిదంచెల ప్రణాళికను రూపొందించామని, ప్రజలందరి దృష్టి 350 మీద పడేలా చేయడం, కార్బన్‌డయాక్సైడ్‌ కారణంగా వాతావరణంలో కలుగుతున్న మార్పుల పట్ల వారిని చైతన్యవంతులను చేయడం, భూగోళాన్ని కాపాడుకోవడంలో ఎవరికి వారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా చేయడం అందులోని కొన్ని అంశాలని వారు వివరించారు. ఈ పర్యావరణ ఉద్యమానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు తమ వెబ్‌సైట్‌ www.ap350.orgను చూడవచ్చని, లేదంటే గూగుల్‌, యూట్యూబ్‌లలో 350 అని టైప్‌ చేస్తే చాలని చైతన్య, రంగప్రసాద్‌లు తెలిపారు.

ఇంతకీ అక్కడ నీరు ఉందా?


ఎన్నో విమర్శలు వెల్లువెత్తినప్పటికీ వాటన్నింటినీ పెడచెవిన పెట్టి ఈ నెల 9న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన ఎల్‌క్రాస్‌ రాకెట్‌తో చంద్రుని ఢీకొట్టించింది. అయితే ఈ ప్రయోగం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లభించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఈ ప్రయోగంలో రెండువేల రెండు వందల టన్నులు బరువున్న ఒక రాకెట్‌ను గంటకు తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి చంద్రుని దక్షిణ «ద్రువ ప్రాంతాన్ని ఢీకొట్టించారు. ఇంతవేగంతో ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా ఎగిసిపడే చంద్రధూళిని పరిశోధించి అందులో ఏమైనా మంచు
అవశేషాలు ఉన్నాయేమో గర్తించడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రయోగానికి ముందు రాకెట్‌ చంద్రుని ఢీకొట్టేటప్పుడు ఎగసిపడే చంద్రధూళిని భూమిపై నుంచి కూడా వీక్షించవచ్చని నాసా ప్రకటించడమే కాకుండా, ఈ ఢీకొట్టే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేస్తున్నామని ఎంతో గొప్పగా ప్రకటించింది. దీంతో ప్రపంచం మొత్తం ఈ ప్రయోగం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ వారందరికీ తీవ్ర నిరాశే మిగిలింది. ఎందుకంటే టెలీస్కోపులో తలదూర్చి రాకెట్‌ ఎప్పుడు చంద్రుని ఢీకొంటుందా అని ఆసక్తిగా చూసినవారికి ఏమీ కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో ఉపగ్రహం చంద్రుని ఢీకొట్టడంగానీ, ధూళి గానీ కనిపించలేదు.

రకరకాల విశ్లేషణలు
నిజానికి దీనికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతామని నాసా ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన విధంగా ఎల్‌క్రాస్‌ ఉపగ్రహం చంద్రుని ఢీకొట్టినప్పుడు ఊహించిన విధంగా చంద్రధూళి కనిపించకపోవడానికి కారణమేమై ఉంటుందన్న విషయాన్ని గురించి నాసాలోని కొంతమంది శాస్త్రవేత్తలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై వెలుతురు తక్కువగా ఉండడం వల్ల బహాశా ఈ ధూళి కనిపించి ఉండకపోవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే నాసాకు సంబంధించినంతవరకు ఈ చిత్రలు ముఖ్యమైనవేమీ కావని, ఢీకొట్టే సమయంలో ఎగసిపడిన ధూళిలో ఏమేం పదార్థాలు ఉన్నాయ్నదే ముఖ్యమని నాసా అంటోంది.

ప్రయోగం ఫ్లాప్‌ అయిందా..
'నేషనల్‌ జియోగ్రాఫిక్‌ న్యూస్‌' మాత్రం ఈ ప్రయోగం ఒక ఫ్లాప్‌ అని అంటోంది. నాసా టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసిన దాంట్లోగానీ, టెలీస్కోపుల సహాయంతో వీక్షించిన వారికీ దుమ్ము గానీ, అందులో ఉంటుందననుకున్న మంచుగానీ కనిపించలేదని కనిపించలేదు. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశ ం ఏదో అదే కచ్చితంగా నిర్థారణ కాలేద ని, కాబట్టి ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఎలా చెప్పగలమని వాదిస్తోంది. మరోవైపు "ఈ ప్రయోగం ఫలితం తప్పకుండా ఉంటుంది. మేం క్రేటర్‌నూ చూశాం, దాని ప్రభావాన్నీ చూశాం'' అని ఎల్‌క్రాస్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆంథోని కొలాప్రేట్‌ అన్నారు. ఇంకోవైపు "ఈ ప్రయోగం ద్వారా మేం ఏం చూశాం అనేదాన్ని చెప్పడం కాస్త కష్టమైన పనే'' అని నాసా రీసెర్చ్‌సెంటర్‌ శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు.

అది మంచు కావచ్చు..
రాకెట్‌ చంద్రని ఢీకొట్టినపుపడు ఎగసిపడిన ధూళిలో కొన్ని తెల్లటి కణాలు కనిపించాయిని, బహుశా అది మంచు అయే ఉంటుందని, కాకపోతే దానిని నిర్థారించేముందు ఎల్‌క్రాస్‌ పంపిన చిత్రాలను విశ్లేషించాల్సి ఉంటుందని నాసా అంటోంది. నాసా వ్యాఖ్యలు ఈ విధంగా ఉండగా 'ఉతా'లోని 'సాల్ట్‌లేక్‌ ఆస్ట్రానామికల్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ వాదన మాత్రం మరోలా ఉంది. "మా దగ్గర 32 అంగుళాల వెడల్పైన టెలీస్కోపులు ఉన్నాయి. కళ్లు కాయలుకాసేలా చూసినా కూడా అందులోంచి ఏమీ కనిపించలేదు'' అనడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.
అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్న సందేహాలన్నింటినీ త్వరలోనే నాసా తీరుస్తుందని, వాస్తవాలను బయటపెడుతుందని ఆశిద్దాం.