
చూడడానికి ల్యాప్‌టాప్‌లా ఉన్నా 'షేపు' కొంచెం అదో టైపులో ఉంది కదూ! అప్పుడే ఏముంది? ఈ స్మార్ట్ ప్యాడ్ ప్రత్యేకతలు వింటే మీరే హాశ్చర్యపోతారు. Nvidia Tegra T20 చిప్‌సెట్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ప్యాడ్‌ను పగలు ఒకలా, రాత్రిపూట మరోలా కనిపించే డిస్‌ప్లే స్క్రీన్ Pixel Qi Transflective Displayతో రూపొందించారు. దీనికున్న 10.1 అంగుళాలు డిస్‌ప్లే స్క్రీన్ 1080 పిక్సెల్స్ హై డెఫినిషన్ వీడియోను సపోర్ట్ చేయడమేకాక గది వెలుతురులో సాధారణ ఎల్‌సిడి మాదిరిగానే పనిచేస్తుంది. అదే పగటిపూట సూర్యకాంతి మీదపడినప్పుడు ఈ స్క్రీన్ ఆటోమేటిక్‌గా తన రంగులు కొంత తగ్గించుకుని ఇ-ఇంక్ ప్యానల్ మాదిరిగా మారిపోతుంది. అంటే.. పగటిపూట ఎండలోనూ టెక్స్‌ట్ మ్యాటర్, ఇమేజెస్, వీడియోలను స్పష్టంగా చూడగలిగే విధంగా మారుతుందన్నమాట. వేలిముద్రలు, గీతలు పడకుండా ఉండేందుకు ఈ డిస్‌ప్లే తయారీలో యాంటీ గ్లేరింగ్, ఫింగర్‌ప్రింట్ స్క్రాచ్ రెసిస్టెంట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ప్యాడ్‌కు USB Portతోపాటుగా లేటెస్ట్‌గా వస్తున్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను అనుసంధానం చేసుకునేందుకు వీలుగా HDMI Ports, 3.5 ఎంఎం స్టీరియో హెడ్‌ఫోన్ జాక్ అండ్ మైక్రోఫోన్ ఇన్‌పుట్, 3 మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటోఫోకస్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, వాటర్ అండ్ యాంబియంట్ లైట్ సెన్సర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. 16 జిబి, 32 జిబి స్టోరేజి సామర్థ్యంతో వెలువడే నోషన్ ఇంక్ స్మార్ట్‌ప్యాడ్‌లో కంపాస్, జిపిఎస్, వైఫై, బ్లూటూత్ అండ్ సెల్యులార్ (హైస్పీడ్ డేటా పాకెట్ యాక్సెస్) అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఇక దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే.. ఒక్కసారి పూర్తిస్థాయిలో రీఛార్జ్ చేసుకుంటే 8 గంటలపాటు హైడెఫినిషన్ వీడియో చూడవచ్చు లేదంటే 16 గంటలపాటు వైఫై బ్రౌజింగ్ చేయవచ్చు. స్టాండ్‌బై టైం వచ్చేసి 48 గంటలు, అంటే.. రెండ్రోజులు ఉంటుంది.
ఇన్ని సదుపాయాలున్న ఈ 'అనామిక' ధర ఎంత ఉంటుందో తెలియాలంటే ఒకటి, రెండు నెలలు నిరీక్షించాల్సిందే మరి!
0 comments:
Post a Comment