
ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న HTC Touch2 మొబైల్ ఫోన్ భారత మార్కెట్‌లోకి రానే వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్ 6.5 అప్లికేషన్‌తో భారత దేశంలో విడుదలైన మొట్టమొదటి GSM ఫోన్ ఇది.
ఈ విండోస్ 6.5 అప్లికేషన్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మొబైల్ విత్ ఫ్లాష్ సపోర్ట్, మై ఫోన్ బ్యాకప్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ సపోర్ట్, విండోస్ మార్కెట్‌ప్లేస్ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. 256 ఎంబి ర్యామ్, 512 ఎంబి రామ్ కలిగిన ఈ మొబైల్ 2.8 అంగుళాల థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే (TFT LCD) కలిగి ఉంటుంది. ఇందులో 3.2 మెగాపిక్సెల్ కెమెరా సాయంతో నాణ్యమైన చిత్రాలను తీసుకోవచ్చు. అంతేకాదు, మరో ప్రత్యేక ఫీచర్ ఇంటర్నల్ జిపిఎస్ ఏంటెన్నా మీరు ఫొటో తీసిన ప్రాంతాన్ని గుర్తిస్తుంది. బ్లూటూత్ 2.1, వైఫై, థర్డ్ జనరేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని 1100 mAh బ్యాటరీతో 2G పరిజ్ఞానం కలిగిన ఫోన్లతో ఏడున్నర గంటలపాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. అలాగే 3G పరిజ్ఞానం కలిగిన ఫోన్లతో అయితే ఆరు గంటలపాటు మాట్లాడుకోవచ్చు. కంప్యూటర్లలో ఉన్నట్లుగానే HTC Touch2 మొబైల్‌లో పాకెట్ ఆఫీస్ ఉంటుంది. దీని ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఒన్ నోట్, పిడిఎఫ్ వంటి అప్లికేషన్‌లు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫోన్ అధీకృత సరఫరాదారు రిలయన్స్ మాత్రమే. అంటే కేవలం రిలయన్స్ మొబైల్ వారి వద్ద మాతమ్రే లభిస్తుందన్నమాట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ HTC Touch2 వ్యాట్ పెరిగిన కారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రూ.24,490కు, మిగిలిన రాష్ట్రాలలో రూ.22,490కు లభిస్తుంది.
1 comments:
హ్మ్మ్.. ఇంటరెస్టింగ్.
నేను ఓ నెల క్రితం కొన్నా ఇక్కడ. $480 పడింది కారియర్ వాడిచ్చే సబ్సిడీ తర్వాత. ఈ లెక్కన ఇండియాలోనే చవక.
Post a Comment