భారతీయ వినియోగదారుల కోసం ఇంటెక్స్ కంపెనీ కొత్తగా నాలుగు డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు IN4495, IN4410, ఐూ80, ఐూ20. వీటిలో IN4495, IN4410 మొబైల్‌ఫోన్లలో రెండు జిఎస్‌ఎం సిమ్ కార్డులను ఉపయోగించవచ్చు. IN80, IN20 ఫోన్లలో ఒక జిఎస్‌ఎం సిమ్ కార్డు, మరో సిడిఎంఎ సిమ్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లలో ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయో చూద్దామా..

ఇక ఇంటెక్స్ IN4410 మోడల్ డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్ విషయానికొస్తే.. ఇందులో రెండు అంగుళాల వెడల్పైన టిఎఫ్‌టి డిస్‌ప్లేతోపాటు విజిఎ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో (ఎక్స్‌టర్నల్ యాంటెన్నా లేకుండా), ఆడియో అండ్ వీడియో ప్లేయర్ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 63 ఎంబి వరకు ఇన్‌బిల్ట్ మెమరీ ఉంది. ఈ ఫోన్ ధర రూ.3,400.
ఇక ఒక జిఎస్‌ఎం, మరో సిడిఎంఎ సిమ్ కార్డులను ఉపయోగించగలిగే.. ఇంటెక్స్ IN80 మొబైల్ ఫోన్‌లో 6.1 సెం.మీ. ఖగఎఅ రిజల్యూషన్ కలిగిన పెద్ద సైజు స్క్రీన్, 2 జిబి ఎక్స్‌పాండబుల్ మెమరీ, 153.6 ఓఞఛట వేగంతో డేటా డౌన్‌లోడ్ చేసుకోగల సౌకర్యంతోపాటు ఎఫ్‌ఎం రేడియో, కెమెరా, యుఎస్‌బి పిసి కనెక్టివిటీ, మోషన్ సెన్సర్, బ్లూటూత్, ఆడియో అండ్ వీడియో ప్లేయర్ విత్ 3.8 ఎంఎం స్టీరియోజాక్ తదితర సదుపాయాలు ఉన్నాయి. 7 గంటల వరకు టాక్‌టైమ్, 260 గంటలపాటు స్టాండ్‌బై టైమ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.5,000.
ఇక ఇంటెక్స్ IN20 మోడల్ ఫోన్ విషయానికొస్తే.. ఇదొక మ్యూజికల్ ఎడిషన్. ఎఫ్‌ఎం రేడియో, ఒన్ వే కాల్ రికార్డ్, మొబైల్ ట్రాకర్, సౌండ్ రికార్డింగ్ తదితర సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 1.5 అంగుళాల CSTN డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ 3 గంటల టాక్‌టైమ్, 150 గంటల స్టాండ్‌బై టైమ్ ఇవ్వగలదు. దీని ధర రూ.1,600.
0 comments:
Post a Comment