పైరసీ.. దెబ్బకు ఒక్క సినిమా రంగమే కాదు.. సాఫ్ట్‌వేర్ రంగం కూడా తలవంచక తప్పడం లేదు. సాఫ్ట్‌వేర్ పైరసీ అనేది చాలాకాలంగా చాపకింద నీరులా సాగిపోతోంది. ఇప్పటి వరకు ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు పైరసీ బారిన పడినా.. తాజా ఉదాహరణ మాత్రం సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇన్‌కార్పొరేషనే. ఏళ్ల తరబడి ఊరించి.. ఊరించి, ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన తన కొత్త ఆపరేటింగ్ సిస్టం 'విండోస్7' కూడా పైరసీ బారిన పడడాన్ని మైక్రోసాఫ్ట్ జీర్ణించుకోలేకపోతోంది.

సాప్ట్వేర్ పైరసీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా సాగిపోతున్నప్పటికీ.. ఎన్నో ఏళ్లు శ్రమించి, విడుదల చేసినతన సాఫ్ట్వేర్.. అధికారికంగా విడుదల కాని దేశాల మార్కెట్లలో సైతం కనిపిస్తుండడం, మరీ రెండు డాలర్లకంటే తక్కువధరకు లభిస్తుండడంతో మైక్రోసాఫ్ట్ దిగ్భాంతికి గురవుతోంది. ఈ పైరసీ బాధను తట్టుకోలేకే గతంలో తన 'ఆఫీస్' సాఫ్ట్వేర్ను చైనాలో రూ.1.360కే విక్రయించేందుకు కూడా సిద్ధమైంది. తాజాగా 'విండోస్7' కూడా పైరసీ బారిన పడడంతోచైనాలో దీని ధర మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు.
మొత్తానికి తన తాజా ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన స్పందనను బేరీజు వేసుకున్న మైక్రోసాఫ్ట్భారతదేశంలో ఈ సాఫ్ట్వేర్ను 40 శాతం తగ్గింపు ధరకే విక్రయించేందుకు సిద్ధమైంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగారూ.10,271 ఉన్న 'విండోస్7 - హోమ్ ప్రీమియం సాఫ్ట్వేర్' ధరను మన దేశంలో మాత్రం 40 శాతం తగ్గించిరూ.6,799గా కంపెనీ నిర్ణయించింది. అలాగే హోమ్ బేసిక్ వెర్షన్ రూ.5899, ప్రొఫెషనల్ వెర్షన్ రూ.11,199, ప్రొఫెషనల్ప్రీమియం(అల్టిమేట్) వెర్షన్ రూ.11,799కి లభించనున్నాయి.
నిజానికి విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం విడుదలను మన దేశంలో మైక్రోసాఫ్ట్ వాయిదా వేయడానికి బలమైన కారణమేఉంది. మన దేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుండడం, బడ్జెట్లో సాఫ్ట్వేర్లపై విధించే పన్నులోమార్పులు జరిగే అవకాశం ఉండడంతో దీనిని దృష్టిలో ఉంచుకుని మన దేశంలో ఈ సాఫ్ట్వేర్ను కాస్త ఆలస్యంగా విడుదలచేయాలని మైక్రోసాఫ్ట్ భావించింది. అయితే పైరసీ బెడద కారణంగా తన వ్యూహం మార్చుకుని వెంటనే విడుల చేసింది. అంతేకాదు.. కొన్ని దేశాలలో విండోస్7 లైసెన్స్‌డ్ సాఫ్ట్వేర్ డివిడి కొన్న వినియోగదారులకు రూ.2600 విలువ కలిగినరిబాక్ షూ'ను ఉచితంగా అందజేస్తామంటూ మైక్రోసాఫ్ట్ భాగస్వామ్య సంస్థలు ఆఫర్ ప్రకటించాయి. అయితే ఆన్లైన్లోకంపెనీని సంప్రదించిన వారం రోజుల్లోగా సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
మరోవైపు తక్కువ ధరకే లభిస్తోంది కదాని 'విండోస్7' పైరసీ డివిడి కొన్న వినియోగదారులకు సాఫ్ట్వేర్ ఆప్డేషన్సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని మైక్రోసాఫ్ట్ భావిస్తుండగా, పైరసీదారులు మాత్రం ఆఇబ్బందినీ అధిగమించేందుకు అనువైన అవకాశాల గురించి అన్వేషించడంలో తలమునకలవుతుండడం విశేషం. ' '
2 comments:
50 rupees ki vachhe software ki 6,799 evaru pedutharandi...MNC lu kakapothe....
బుచ్చిబాబుగారూ.. విండోస్7కు సంబంధించిన పోస్ట్ చదివినందుకు థాంక్స్. మీరన్నది నిజమే కానీ, సాధారణంగా చీప్‌గా వస్తుంది కదాని పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ కొనుక్కున్నా.. తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రతి సాఫ్ట్‌వేర్‌ను.. అందులోని లోపాలను గమనిస్తూ.. దాని తయారీదారులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటారు. వీటినే 'ప్యాచ్‌లు' అంటుంటారు. ముఖ్యంగా కంప్యూటర్‌కు ఆయువుపట్టులాంటి ఆపరేటింగ్ సిస్టం, అలాగే యాంటీవైరస్ లాంటి సాఫ్ట్‌వేర్‌ల విషయానికొస్తే లైసెన్స్‌డ్ వెర్షన్ కొనుక్కోవడమే అన్ని విధాలా మంచిది. డబ్బు పోయినా మనశ్శాంతి దక్కుతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండకపోతే కొన్ని సంవత్సరాల తరువాత పైరేటె డ్ సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయకపోవచ్చు. ప్రయత్నిస్తే ఈ అప్‌డేట్‌లకు సంబంధించిన 'ప్యాచ్‌లు' కూడా పైరసీదారుల వద్ద లభిస్తాయేమో. కానీ ఎంతకాలమని ఇలా అక్రమ మార్గంలో సాగడం?
Post a Comment