మీరెప్పుడైనా త్రి-డి సినిమా చూశారా? పోనీ చూడకపోయినా, కనీసం ఇలాంటి సినిమా గురించి వినే ఉంటారు.  అయితే సిక్స్-డైమన్షనల్ సినిమా గురించి విన్నారా? వినడం కాదు, పోనీ ఇలాంటి సినమా ఒకటి వస్తుందేమో అనే ఆలోచన అయినా చేశారా?  మీరే కాదు, ప్రపంచంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. అయితే ఆ అద్భుతం జరిగిపోయింది. సిక్స్ డైమన్షనల్ సినిమా వచ్చేసింది.  బ్రిటన్‌కు చెందిన 'లైట్ సినిమా' సంస్థ ఈ సరికొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించింది. 
ప్రపంచంలోనే మొట్టమొదటి సిక్స్-డైమన్షనల్ సినిమాను రొమేనియాలోని బుఖారెస్ట్‌లో ఉన్న థియేటర్‌లో విడుదల చేసింది.  యూరప్‌లో హై-ఎండ్ డిజిటల్ థియేటర్లను ఏర్పాటు చేయడం ఈ 'లైట్ సినిమా' సంస్థ ఉద్దేశం. సిక్స్ డైమన్షనల్ సినిమా ప్రదర్శనలో.. త్రి-డి సినిమాతోపాటుగా వర్షం, గాలి, వాసన కూడా మరో మూడు ఎలిమెంట్‌లుగా పనిచేస్తాయి.  ప్రేక్షకులు కూర్చున్న సీట్లు ఎటు కావాలంటే అటు కదలడం మరో విశేషం. ఇందుకోసం బుఖారెస్టలో 40 సీట్లు కలిగి, 8 స్క్రీన్‌లతో కూడిన  సినీప్లెక్స్ అనే థియేటర్‌ను రూపొందించింది.  త్వరలోనే రెండో సిక్స్-డి సినిమాను విడుదల చేసేందుకు 'లైట్ సినిమా' రెడీ అవుతోంది, అదీ బుఖారెస్ట్‌లోనే!


0 comments:
Post a Comment