
సామ్‌సంగ్ తాజాగా భారత్‌లో తన టచ్‌స్క్రీన్ ఫోన్ల శ్రేణికి మరో ఫోన్‌ను చేర్చింది. దీనిపేరు S5620 Monte. 3 అంగుళాల టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ కలిగి ఉన్న ఈ ఫోన్ సామ్‌సంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టం టచ్‌విజ్ 2.0 ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేస్తుంది. 200 ఎంబి ఇంటర్నల్ మెమరీ కలిగిన ఈ థర్డ్ జనరేషన్ (3G) ఫోన్ 3.2 మెగాపిక్సెల్ కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, ఎంపి3 ఆడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, వీడియో ప్లేయర్, బ్లూటూత్, ఎ-జిపిఎస్ తదితర సౌకర్యాలను కలిగి ఉంది. కావాలంటే మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా ఫోన్ మెమరీని పెంచుకోవచ్చు. పైగా ప్రీలోడెడ్ గూగుల్ మ్యాప్స్ సౌకర్యం కూడా ఉంది. సామ్‌సంగ్ తాజా సంచలనం కార్బీకి ప్రత్యామ్నాయంగా ఇన్ని ఫీచర్లు, సౌకర్యాలు కలిగి ఉన్న మరో ఫోన్ ఇది. పైగా 3G ఫోన్. ధర మాత్రం కేవలం రూ.8850.
0 comments:
Post a Comment