
ఎల్‌జి కంపెనీ భారత మార్కెట్‌లోకి తాజాగా రెండు థర్డ్ జనరేషన్(3జి) మొబైల్స్‌ను విడుదల చేసింది. వీటి పేర్లు GU285, GU220. వీటిలో ఎ్ఖ285 స్లయిడర్ ఫోన్. డ్యూయల్ కెమెరా విత్ వీడియో కాలింగ్, స్మార్ట్ మెమో, షెడ్యూల్ ఎస్సెమ్మెస్ తదితర ఫీచర్లు కలిగి ఉండగా, ఎ్ఖ220 మాత్రం సోషల్ నెట్‌వర్కింగ్, జస్ట్ క్రికెట్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్లతోపాటుగా ఇమేజ్ ఎడిటింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది.
ఎల్‌జి GU285 మొబైల్‌ఫోన్‌లో 13 ఎంబి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అవసరాన్ని బట్టి మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా దీనిని 8 జిబి వరకు పెంచుకునే వీలుంది. ఈ ఫోన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ల విషయానికొస్తే.. ఎంపి3 ప్లేయర్ విత్ 6 ఇన్‌బిల్ట్ ఈక్వలైజ్, ఎఫ్‌ఎం రేడియో ఉన్నాయి. ఇంకా యాంటీ థెఫ్ట్ మొబైల్ ట్రాకర్, ఎన్‌డి టివి యాక్టివ్, గూగుల్ సెర్చ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌జి హెల్ప్‌డెస్క్, డేటావాలెట్, రాకీటాక్(సోషల్ నెట్‌వర్కింగ్), న్యూస్ హంట్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, వినియోగదారులు 5 ఈ-మెయిల్ అకౌంట్లు సృష్టించుకోవచ్చు. హైస్పీడ్ 3జి డేటా నెట్‌వర్క్స్ ద్వారా క్షణాల్లో ఈ-మెయిల్ చెక్ చేసుకోవచ్చు. 10 గంటల టాక్‌టైం, 580 గంటల స్టాండ్‌బై టైమ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.6,500.
ఇక ఎల్‌జి GU220 మొబైల్ విషయానికొస్తే.. 5.6 సెం.మీ. వైడ్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ కోసం విజిఎ కెమెరా ఉంది. మెటాలిక్ డిజైన్‌తో చూడముచ్చటగా ఉండే ఈ స్లయిడర్ ఫోన్‌లో బేసిక్ మల్టీమీడియా ఫీచర్లు.. ఎంపి3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో విత్ ఎఫ్‌ఎం రికార్డింగ్ వంటివి ఉన్నాయి. ఇంటర్నల్ మెమరీ 4.5 ఎంబి మాత్రమే, కావాలంటే మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 2 జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో కూడా యాంటీ థెఫ్ట్ మొబైల్ ట్రాకర్ సదుపాయం ఉంది. ఇంకా న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎన్‌డి టివి యాక్టివ్, అలాగే జి-టాక్, యాహూ ఇన్‌స్టంట్ మెసెంజర్స్‌కు అనుసంధానం అయ్యేందుకు రాకీ టాక్ అప్లికేషన్ ఉంది. అంతేకాదండోయ్, క్రికెట్ అభిమానుల కోసం జస్ట్ క్రికెట్ అనే అప్లికేషన్ కూడా ఉంది. దీనిసాయంతో ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా క్రికెట్‌మ్యాచ్ చూడడమేకాదు, స్కోర్ కూడా తెలుసుకోవచ్చు.
8 గంటల టాక్‌టైం, 500 గంటల స్టాండ్‌బై టైమ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.4,500.
1 comments:
nice.. meeru LG lo work chestunnara andi??
Post a Comment