
గార్మిన్ కంపెనీ ఆసస్‌తో కలిసి సంయుక్తంగా ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని పేరు గార్మిన్-ఆసస్M10. మైక్రోసాఫ్ట్ తాజా మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ మొబైల్ 6.5.3, క్యూయల్‌కామ్ 7227 ప్రాసెసర్ ఆధారంగా పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్ 3.5 అంగుళాల WVGA ఫుల్ టచ్‌స్క్రీన్, 5 మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటోఫోకస్ తదితర సదుపాయాలను కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్, 512 ఎంబి రామ్ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉడే ఈ ఫోన్ 4జిబి ఎస్‌డి కార్డ్ సహితంగా లభిస్తుంది. కావాలంటే మైక్రోఎస్‌డి కార్డ్ ద్వారా ఈ మెమరీని 32జిబి వరకు పెంచుకునే వీలుంది. అంతేకాదు ఇందులో నావిగేషన్ మ్యాప్స్‌తోపాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లో వాయిస్ గైడెన్స్ సదుపాయం కూడా ఉంది. అలాగే ఎ-జిపిఎస్, ఫుల్ ఇ-మెయిల్, క్యాలెండర్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, వైఫై తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. రెండు నెలల క్రితమే భారత్‌లో అధికారికంగా విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,990.
0 comments:
Post a Comment