Wednesday 21 April 2010

మీ కంప్యూటర్‌లో సమస్య ఉందా?

మీ కంప్యూటర్‌ పని చేయనని మొరాయిస్తుందా? సీరియస్‌గా పని చేసుకుంటున్నప్పుడు చటుక్కున హ్యాంగ్‌ అవుతుందా? కీబోర్డు పని చేయడం లేదా? మానిటర్‌పైన ఉండే డెస్కటాప్‌ ఉన్నట్లుండి కనిపించకుండా పోతుందా? ఇవే కాదు, ఇంకా ఎలాంటి సమస్యనైనా సరే.. ఓ చిన్న సాప్ట్‌వేర్‌ సాయంతో గుర్తించవచ్చు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇన్‌కార్పొరేషన్‌ ఇటీవల 'ఫిక్స్‌ ఇట్‌ సెంటర్‌' పేరుతో ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీనిని మీ సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. మీ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన సమస్యలను పసిగట్టి మీకు తెలియజేస్తుంది. మీకిష్టమైతే మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి మైక్రోసాఫ్ట్‌ సపోర్ట్‌ సహాయం తీసుకోవచ్చు.
ప్రస్తుతం 'ఫిక్స్‌ ఇట్‌ సెంటర్‌ ఆన్‌లైన్‌' బీటా వెర్షన్‌ కంప్యూటర్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీనిని ఉచితంగా మీ సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం స్క్రీన్‌ మీద కనిపించే మెసేజెస్‌ను ఫాలో అవుతూ ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయవచ్చు. ఇది విండోస్‌ ఎక్స్‌పి, విస్టా, సర్వర్‌, విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టంలను సపోర్ట్‌ చేస్తుంది. 'ఫిక్స్‌ ఇట్‌ సెంటర్‌' సాఫ్ట్‌వేర్‌ గురించిన మరిన్ని వివరాలకు, ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు http://fixitcenter.support.microsoft.com/Portal/GetStartedను చూడొచ్చు.

4 comments:

సామాన్యుడు said...

సార్, నేను కంప్యూటర్ ఎరాలో వచ్చిన ఆటో రన్ టిప్ చదివి kill autorun download చేసాను. దాని వలన ఆటోరన్ ఆగిపోయింది, కానీ మెమరీ కార్డ్స్ లో auto.inf అనే file create అయిపోతూ నోకియా software problems వస్తున్నాయి. దాంతో అది తీసేసినా system tray లో icon కనిపిస్తోంది. కార్డ్స్ లో file create అవుతున్నాయి. దయచేసి దానిని పూర్తిగా remove చేసే విధానం చెప్పరూ..

Ramesh Babu Yenumula said...

సామాన్యుడు గారూ.. మీ పరిస్థితికి చింతిస్తున్నాను. నేనేమీ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ని కాదు, అయినా నాకు తెలిసినంతలో మీ సమస్యకు చిన్న ఉపాయం ఒకటి చెబుతాను. మీ కంప్యూటర్‌ సిస్టంను లేటెస్ట్‌ యాంటీవైరస్‌తో ఒకసారి స్కాన్‌ చేయండి. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే ఎవరైనా మంచి హర్డ్‌వేర్‌ ఇంజినీర్‌ను పిలిపించుకుని సిస్టంలో 'సి' డ్రైవ్‌ను ఫార్మేట్‌ చేయించుకోండి. అలాగే మీ మెమరీ కార్డును కూడా ఒకసారి ఫార్మేట్‌ చేసి, ముందుగా మీరే అందులో ్చఠ్టౌ.జీnజ, ్చఠ్టౌటఠn.జీnజ అనే పేర్లతో రెండు ఫోల్డర్లను క్రియేట్‌ చేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఈ పేర్లు గల వైరస్‌లు మీ మెమరీ కార్డ్‌లోకి ప్రవేశించకుండా ఉంటాయి.

Ramesh Babu Yenumula said...

సామాన్యుడు గారూ.. మీ పరిస్థితికి చింతిస్తున్నాను. నేనేమీ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ని కాదు, అయినా నాకు తెలిసినంతలో మీ సమస్యకు చిన్న ఉపాయం ఒకటి చెబుతాను. మీ కంప్యూటర్‌ సిస్టంను లేటెస్ట్‌ యాంటీవైరస్‌తో ఒకసారి స్కాన్‌ చేయండి. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే ఎవరైనా మంచి హర్డ్‌వేర్‌ ఇంజినీర్‌ను పిలిపించుకుని సిస్టంలో 'సి' డ్రైవ్‌ను ఫార్మేట్‌ చేయించుకోండి. అలాగే మీ మెమరీ కార్డును కూడా ఒకసారి ఫార్మేట్‌ చేసి, ముందుగా మీరే అందులో auto.inf, autorun.inf అనే పేర్లతో రెండు ఫోల్డర్లను క్రియేట్‌ చేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఈ పేర్లు గల వైరస్‌లు మీ మెమరీ కార్డ్‌లోకి ప్రవేశించకుండా ఉంటాయి.

Rao S Lakkaraju said...

సామానుడు గారూ
కంట్రోల్ పానల్ లోకి వెళ్లి add remove programs
క్లిక్ చేసిన మీ కంప్యూటర్ లో పనిచేస్తున్న ప్రోగ్రాములు లిస్టు వస్తుంది. దానిలో మీ ప్రోగ్రాం పేరు చూసి uninstall చెయ్యండి. మీ పనికిరాని ప్రోగ్రాం కంప్యూటర్ లో నుండి ఐకాన్ తో సహా వెళ్లి పోతుంది.