
బెంగళూరుకు సంబంధించిన యునైటెడ్ టెలీ లింక్స్, జైన గ్రూప్‌లకు చెందిన కార్బన్ మొబైల్ సంస్థ కొత్తగా రెండు మొబైల్‌ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి పేరు K 460, K560.

వీటిలో ఓ460 డ్యూయల్ సిమ్(జిఎస్‌ఎం) స్లయిడర్ ఫోన్. ఎఫ్‌ఎం రేడియో, ఎఫ్‌ఎం రికార్డింగ్, ఎంపి3 ప్లేయర్, వీడియో ప్లేయర్, బ్లూటూత్, డిజిటల్ కెమెరా, వాప్, జిపిఆర్‌ఎస్, ఎంఎంఎస్ తదితర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ మెమరీని 8 జిబి వరకు పెంచుకోవచ్చు. 300 గంటల స్టాండ్‌బై టైమ్ దీనికొక అదనపు ఆకర్షణ. దీని ధర రూ.4,000.
ఇక ఓ560 విషయానికొస్తే.. ఇది 2.4 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సదుపాయం కలిగిన డ్యూయల్ సిమ్(జిఎస్‌ఎం) మొబైల్ ఫోన్. ఓ460 లాగే ఇందులో కూడా ఎఫ్‌ఎం రేడియో, ఎఫ్‌ఎం రికార్డింగ్, ఎంపి3 ప్లేయర్, వీడియో ప్లేయర్, 2 మెగా పిక్సెల్ కెమెరా, ఎ2డిపి బ్లూటూత్, వాయిస్ ఛేంజర్, జిపిఆర్‌ఎస్, వాప్, ఎంఎంఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ఎంపి3 ప్లేయర్‌లో ఉండే పర్సనల్ డిస్క్ ఇంటర్‌ఫేస్, ఉల్ఫ్‌సన్
కోడెక్‌ల ద్వారా అద్భుతమైన ఆడియో అనుభవం మీ సొంతమవుతుంది. ఈ ఫోన్ ధర రూ.5,000.
0 comments:
Post a Comment