
'నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలి..రా!' అని ఓ సినీ గీత రచయిత ఏనాడో సెలవిచ్చాడు. నవ్వుతూ చావకపోయినా కనీసం బతికినన్నాళ్లయినా నవ్వుతూ బతకొచ్చుకదా! పైగా నవ్వు.. నాలుగు కాలాలపాటు మనల్ని బతికిస్తుంది కూడా. అందుకే అందరినీ నవ్వించేందుకు ఓ కొత్త వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. దీనిపేరు 'కార్టూన్ కబుర్లు.ఇన్'. ఇక్కడ ఇచ్చిన కార్టూన్ చూశారు కదా.. ఇలాంటివి బోలెడు కార్టూన్లు www.cartoonkaburlu.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి. చదివి హాయిగా నవ్వుకోండి. ఈ వెబ్‌సైట్ రూపకల్పనలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించండి. అంతేకాదు, ఈ 'కార్టూన్ కబుర్లు.ఇన్' గురించి మీ స్నేహితులకు, బంధువులకు.. అందరికీ తెలియజేయండి. ఒకవేళ మీలో ఎవరైనా కార్టూనిస్టులు, కార్టూన్ ఇష్టులు ఉన్నట్లయితే.. మీరు గీసిన కార్టూన్లు, మీకు నచ్చిన కార్టూన్లు, ఆయా కార్టూనిస్టులు గీసిన, మీరు చూసిన వివిధ కార్టూన్ల గురించి మీ అభిప్రాయాలు అన్నీ కూడా 'కార్టూన్ కబుర్లు.ఇన్'కు పంపించవచ్చు.
0 comments:
Post a Comment