
‘ షోలే’.. భారత దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు బ్రహ్మరథం
పట్టిన సినిమా. బాలీవుడ్ సినిమా రంగానికే ఓ
నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన ఈ సినిమా విలన్ గబ్బర్ సింగ్
ఆవిర్భావం వెనుక దాగిన రహస్యం ఇప్పుడు తొలిసారిగా వెలుగులోకి రానుంది!
30 సంవత్సరాల
క్రితం బాలీవుడ్ క్లాసిక్ చిత్రం షోలే ద్వారా పరిచయమై..
బందిపోటు దొంగల నాయకుడిగా హడలగొట్టిన, నేటికీ మరిచిపోలేని గొప్ప విలన్ గబ్బర్ సింగ్
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత మనల్నిఅలరించడానికి
రాబోతున్నాడు.
ఒక సాధారణ బాలుడి జీవితంలో ఎదురైన అనేక పరిస్థితులు, విషాద ఘటనలు.. అతడి మనసుపై ఎలాంటి ముద్రలను వేశాయో.. పెరిగి
పెద్దయ్యాక అతడినొక నరరూప రాక్షసుడిగా.. ‘గబ్బర్ సింగ్’ గా ఎలా మార్చేశాయో తెలిపే గాథను ఇప్పుడు మళ్ళీ మనం ఈ కామిక్ పుస్తకం
రూపంలో చూడబోతున్నాం.. చదవబోతున్నాం... వెల్ కమ్ టు ‘గబ్బర్ సింగ్’!
న్యూస్ హంట్ బ్లాగ్ ను
చూడాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి.
0 comments:
Post a Comment