2010 సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ ది టాబ్లెట్'గా చెప్పుకోవలసిందే. ఎందుకంటే ల్యాప్‌టాప్‌లకు క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పటికే వీటి స్థానాన్ని నెట్‌బుక్‌లు, స్మార్ట్‌బుక్‌లు భర్తీ చేస్తున్నాయి. భవిష్యత్తులో టాబ్లెట్ పిసిలు రాజ్యమేలనున్నాయి. ఇప్పటికే హ్యూలెట్ పాకార్డ్, తోషిబా, ఫ్యూజిత్సు, లెనొవో, డెల్, ఏసస్, శాంసంగ్, ఆర్మర్ తదితర కంపెనీలకు చెందిన టాబ్లెట్ పిసిలు మార్కెట్‌లో ఉండగా, ఈ రేసులో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫ్రీస్కేల్ వంటి కంపెనీలు పోటీకి దిగాయి. భవిష్యత్తులో టాబ్లెట్ పిసిల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అన్ని కంపెనీల దృష్టి వీటిపై పడింది. ఈ వారం అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరగనున్న 2010 ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (ఐసిఇఎస్)లో చిప్‌ల తయారీ కంపెనీ ఫ్రీస్కేల్ సెమీకండక్టర్ ఇన్‌కార్పొరేషన్ కూడా తాజాగా స్మార్ట్ అప్లికేషన్ బ్లూ ప్రింట్ ఫర్ ర్యాపిడ్ ఇంజనీరింగ్ (ఎస్‌ఎబిఆర్‌ఇ) పేరిట ఓ టాబ్లెట్ పిసిని ఆవిష్కరిస్తోంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న యాపిల్ కంపెనీ కూడా తన టాబ్లెట్ పిసిని ఈ ప్రదర్శనలోగాని, లేదంటే ఈ నెలలో ఎప్పుడైనా గాని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని టాబ్లెట్ పిసిల గురించి మీకోసం...

కంపెనీ : ఫ్రీస్కేల్ సెమీకండక్టర్ ఇన్‌కార్పొరేషన్
డిస్‌ప్లే : 7 అంగుళాల 3డి డెస్క్‌టాప్ టచ్‌స్క్రీన్ విత్ QWERTY కీబోర్డ్
ప్రాసెసర్ : ARM Cortex-A8 core ఆధారిత ఫ్రీస్కేల్ i.MX515 processor
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్, లైనక్స్.. రెండు ఆపరేటింగ్ సిస్టంలలో పని చేస్తుంది.
ర్యామ్ : 512 ఎంబి ఇన్‌బిల్ట్ డిడిఆర్2
స్టోరేజి సామర్థ్యం : 4 జిబి నుంచి 64 జిబి వరకు, మైక్రోఎస్‌డి కార్డ్ స్లాట్ కూడా ఉంది.
కెమెరా : 3.0 మెగా పిక్సెల్ (30 ఫ్రేమ్స్ పర్ సెకన్ VGA వీడియో రికార్డింగ్)
సెన్సర్స్ : 3్చ్ఠజీట యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్
ఇతర ఫీచర్లు : 3జి కనెక్టివిటీ, బ్లూటూత్, జిపిఎస్, యుఎస్‌బి 2.0, యుఎస్‌బి మినీ పోర్ట్, ఆడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ఎస్‌జిటిఎల్ 5000 ఆడియో కోడెక్, వైఫై తదితర సౌకర్యాలు.
ధర : రూ.9,223
యాపిల్ టాబ్లెట్
యాపిల్ కంపెనీ ఏళ్ల తరబడి ఊరిస్తున్న టాబ్లెట్ పిసి రూపం ఇలా ఉండొచ్చనేది విశ్లేషకుల ఊహ. ఐ-స్లేట్, ఐ-ప్యాడ్, ఐ-టాబ్లెట్ అనే మూడు పేర్లలో ఏదో ఒకటి దీని పేరు అయి ఉండొచ్చని వారు ఊహిస్తున్నారు. ఈ టాబ్లెట్ పిసి ఫీచర్లు బయటి ప్రపంచానికి తెలియకుండా యాపిల్ ఇన్‌కార్పొరేషన్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సోమవారం ది వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో దీని గురించి ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. ఇదొక హై- మల్టీమీడియా డివైజ్. 10 లేదా 11 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగి ఉండే ఈ టాబ్లెట్ పిసిలో సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు తిలకించవచ్చు. ఇంటర్నెట్‌లో విహరించడం, గేమ్‌లు ఆడడం, ఎలక్ట్రానిక్ ఇ-బుక్స్‌తోపాటు న్యూస్‌పేర్లు కూడా చదువుకోవచ్చు. దీని ధర కూడా వెయ్యి డాలర్లు అంటే.. మన డబ్బులో రూ.46,180 ఉండొచ్చని ఊహిస్తున్నారు.
హెచ్‌పి పెవిలియన్ tx2500z
4 జిబి DDR2 మెమరీ సామర్థ్యం కలిగిన ఈ టాబ్లెట్ AMD Turion 64 X2 డ్యూయల్ కోర్ మొబైల్ టెక్నాలజీ ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. 12.1 అంగుళాల WXGA టచ్‌స్క్రీన్ / యాక్టివ్ డిజిటైజర్ డిస్‌ప్లే, 160 జిబి హార్డ్‌డిస్క్, డ్యూయల్ లేయర్ డివిడి బర్నర్, ఫింగర్ ప్రింట్ రీడర్ తదితర ఫీచర్లు దీని సొంతం.
లెనొవో థింక్‌ప్యాడ్ X200
ఇంటెల్ కోర్ 2 డ్యూయల్ SL9600 ప్రాసెసర్, విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పని చేస్తుంది. 12.1 అంగుళాల WXGA విత్ మల్టీటచ్ అండ్ Wacom LED Backlit డిస్‌ప్లే, 160 జిబి హార్డ్ డ్రైవ్, దీని ఫీచర్లలో కొన్ని మాత్రమే. పగటి పూట వెలుతురులో సైతం ఇమేజెస్, టెక్స్ట్‌ను స్పష్టంగా చూపించగలగడం దీని ప్రత్యేకత.
ఏసస్ ఈ పిసి T91
CPU Intel Atom Z520 ప్రాసెసర్, విండోస్ ఎక్స్‌పీ హోమ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పని చేస్తుంది. దీని స్టోరేజి సామర్థ్యం 52 జిబి ( 16 జిబి సాలిడ్ స్టేట్ డ్రైవ్ + 16 జిబి ఎస్‌డి కార్డ్ + 20 జిబి ఈ-స్టోరేజి). 8.9 అంగుళాల ఎల్‌ఇడి బ్యాక్‌లిట్ విత్ రెసిస్టివ్ టచ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇంకా 3.0 మెగా పిక్సెల్ వెబ్‌కామ్, 3 ఇన్ 1 మీడియా కార్డ్ రీడర్, వైఫై, బ్లూటూత్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.
హెచ్‌పి ఎలైట్ బుక్ 2730p
ఇంటెల్ కోర్ 2 డ్యూయల్ 1.86 GHz LV ప్రాసెసర్, విండోస్ విస్టా బిజినెస్ ఆపరేటింగ్ సిస్టంల కలయికతో పని చేస్తుంది. 12.1 అంగుళాల Illumi-Lite, WXGA UWVA యాంటీ గ్లేర్ విత్ డిజిటైజర్ డిస్‌ప్లే కలిగిన ఈ టాబ్లెట్‌లో ఇంకా 3 జిబి ర్యామ్, 120 జిబి హార్డ్‌డ్రైవ్, యుఎస్‌బి 2.0, బ్లూటూత్, ఎక్స్‌ప్రెస్, ఎస్‌డి కార్డ్ స్లాట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హెచ్‌పి టెక్ స్మార్ట్ tx2z
12.1 అంగుళాల WXGA హైడెఫినిషన్ హెచ్‌పి ఎల్‌ఇడి బ్రైట్ వ్యూ వైడ్ స్క్రీన్ విత్ ఇంటిగ్రేటెడ్ టచ్ డిస్‌ప్లే, 4 జిబి DDR2 ర్యామ్, 400 జిబి హార్డ్‌డ్రైవ్, వెబ్‌కామ్, ఫింగర్ ప్రింట్ రీడర్ విత్ హెచ్‌పి ఇంప్రింట్ ఫినిష్, వైర్‌లెస్ ఎన్-కార్డ్ విత్ బ్లూటూత్, లైట్ స్కైబ్ సూపర్ మల్టీ Ît 8X DVD+/-RW విత్ డబుల్ లేయర్ సపోర్ట్ డివిడి డ్రైవ్, హెచ్‌పి మినీ రిమోట్ కంట్రోల్, 5 ఇన్ 1 డిజిటల్ మీడియా రీడర్ తదితర ఫీచర్లు కలిగిన ఈ టాబ్లెట్ AMD Turion X2 అల్ట్రా డ్యూయల్ కోర్ మొబైల్ టెక్నాలజీ ప్రాసెసర్, విండోస్ విస్టా హోమ్ ప్రీమియం ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పని చేస్తుంది.
సామ్‌సంగ్ Q1UP-V
ఈ అల్ట్రా-పోర్టబుల్ టాబ్లెట్ పిసిలో ఇంటెల్ కోర్ సోలో ప్రాసెసర్ ULV U1500ను ఉపయోగించారు. 7 అంగుళాల ఎల్‌ఇడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే కలిగిన ఈ టాబ్లెట్ విండోస్ విస్టా బిజినెస్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పని చేస్తుంది. ఇంకా ఇందులో 2 జిబి DDR2 ర్యామ్, 80 జిబి హార్డ్ డ్రైవ్, యుఎస్‌బి, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ రీడర్, మల్టీ మీడియా, ఎస్‌డి కార్డ్ స్లాట్స్, డ్యూయల్ లేయర్ డివిడి రైటర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.
ఆర్మర్ X10
ఇంటెల్ కోర్ డ్యూయల్ మొబైల్ టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఈ టాబ్లెట్ పిసిలో 10.4 అంగుళాల సన్‌లైట్ రీడబుల్ టచ్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 2.5 అంగుళాల హార్డ్ డ్రైవ్ ఉన్నాయి. ఇంకా క్విక్ బ్యాక్ డేటా రికవరీ సిస్టం, ఇంటిగ్రేటెడ్ వైఫై, బిల్టిన్ వైర్‌లెస్ లాన్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీని చుట్టూ ఉండే అల్యూమినియం కేసింగ్ దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షిస్తుంది.